Monday, April 25, 2022

Spiritual knowledge

 ఈ సమస్త మానవాళికి అవసరం అయ్యేది మరియు కావలసింది ప్రేమ, క్షమాగుణం ,సహనం ఇవి ప్రతి మనిషిలోనూ ఉన్నాయి. కానీ లోభాలలో పడి అవి మరుగున పడిపోయాయి. అసలు లోభం అంటే ఏమిటో తెలుసుకుందాం లోభం అంటే విపరీతమైన కోరికలు మరియు కామం అనుకుంటారు కాదు. లోభం అంటే మనది అయినది విడిచి మనది కాని దాని వెనక పరిగెత్తడం ఈ క్రమంలో మొట్టమొదటగా జరిగేది మనకు మనం దూరం అవడం తరువాత సమస్యల వలయంలో చిక్కడం. ఇక్కడ ఎల్ .ఎఫ్ .పి యోగా టెక్నిక్స్ మొదట నీతో నిన్ను అనుసంధానం చేస్తాయి తరువాత patience సహనశక్తి (soul energy) అనేది పెరిగి నీ కర్మలను నువ్వు దగ్ధం చేసుకుంటావు.

అసలు నువ్వు ఎవరు ?ఎక్కడి నుండి వచ్చావు? ఎందుకు వచ్చావు? నువ్వు పరమాత్మ యొక్క అంశవి ,విశ్వం నుండి వచ్చావు, నువ్వు ఒక Spiritual being వి body,Mind, Senses, Intellectual,Ego తో Human experience తీసుకోవడానికి వచ్చావు. ఇవి అన్నింటిని మరిచి నీది కానిది అంటే డబ్బు ,బంధం వీటిపై మోహo పెంచుకొని లోభం లో పడి  నీ Real entity కి దూరం అయ్యావు.L.F.P yoga అనేది నీతో నిన్ను ,నీలోని నిన్ను నీతో కనెక్ట్ చేస్తోంది. ప్రతిదీ ఒక అవసరం మాత్రమే కానీ మనం ఆ అవసరాన్ని శాశ్వతమనుకొని భ్రమ లో ఉంటున్నాము.

                 దేహం--మోహం

అందరూ ఏమనుకుంటారంటే దేహం పై మోహo అని కాదు. దేహం అంటే శరీరం ,మోహoఅంటే మైండ్, దేహంపైన మోహo వద్దు అంటే దేహం =physical body,physical world,physical attachments వద్దు, పైన మోహo అంటే మొదట physical body second mind ఈ రెండూ వద్దు. ఈ రెండింటినీ దాటి నిన్ను అంటే నీ నిజ స్థితికి చేరుకో అని చెప్పేదే ఆధ్యాత్మికత. అసలు నిజం ఏమిటి అంటే దేహం--మోహం--ఆత్మ మొదట రెండింటినీ దాటి అంటే experience అయ్యి నువ్వు ఆత్మవి అని తెలుసుకోవడానికి ఈ భూమి మీదకు వచ్చావు.(L.F.P yoga సాధన ద్వారా నేను తెలుసుకున్నది ఏమిటి అంటే ,నేను శరీరాన్ని కాదు ,నేను మనస్సుని కాదు, నేను ఆత్మను కూడా కాదు, నేను ఒక పరమాత్మ అంశను నన్ను నేనుగా నా పరమాత్మకు surrender(అర్పించి) అయ్యి నాతో నేను నాలో నేను రమించడమే నా నిజస్థితి. ఈ స్థితిలో బాధ లేదు, సంతోషం కూడా లేదు కేవలం ఆనందం మాత్రమే ఉంటుంది. సాక్షికి సాక్షి తత్త్వం వహించడమే ఈ స్థితి (నిజ స్థితి).

                       ప్రేమ

ఈ విశ్వంలో ఉన్నది అంతా ప్రేమే అది దాటి అనంత సృష్టిలో ఉన్నదంతా కూడా ప్రేమే. నీ గురించి నువ్వు తెలుసుకోవడం ప్రేమ .ప్రేమకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే విశ్వం ఎందుకంటే ప్రేమంటే సృష్టించడం ఈ విశ్వం ప్రతి క్షణం తనని తాను ఏదో ఒక రూపంలో సృష్టించుకుంటూ నే ఉంటుంది. తనని తాను ఇంకా తెలుసుకోవాలి అనే విపరీతమైన తపన, మనమంతా ఆ తపన యొక్క ప్రతిరూపాలే. ఇక్కడ నిన్ను నువ్వు ప్రశ్నించుకో నువ్వేం  సృష్టిస్తున్నావు ?నువ్వేం తెలుసుకుంటున్నావు? అని. ప్రస్తుతం ఈ భూమి మీద ఎన్నో రకాల సాధనా మార్గాలు ఉన్నాయి కానీ కేవలం ఒక L.F.P యోగ మాత్రమే ప్రేమ అంటే విశ్వశక్తి అని చెప్పి దానిని నువ్వు ఎక్స్పీరియన్స్ అయ్యేలా చేయగలదు(Message from lord shiva).ప్రతి ఒక్కరూ ఏదో ఒక టెక్నిక్ సాధన చేసి ఆ దృష్టికోణం తో చూసి అదే ఆధ్యాత్మికత అనుకుంటారు. ఇక్కడ ఎల్.ఎఫ్.పి యోగ అనేది నిన్ను అన్ని కోణాలలో ఆవిష్కరింప చేస్తోంది.

ఇప్పుడు మనం నెగిటివ్ ఎనర్జీస్ అంటే ఏమిటో తెలుసుకుందాం. నెగిటివ్ ఎనర్జీ అంటే నీతో కర్మ బంధం ఉన్న నీ కంటే ఎక్కువ అజ్ఞానంతో ఉన్న ఒక ఆత్మ అంతే. ఇక్కడ మనల్ని మనం చెక్  చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే Low frequency కి మనం కనెక్ట్ అవుతున్నాము,attract అవుతున్నాము, కానీ High frequent కి ఎందుకు కనెక్ట్ అవ్వలేక పోతున్నాం అంటే pending works ఉన్నాయి. మన మీద మనం చేయాల్సిన హోం వర్క్ చేయడం లేదు. మనలోపల ఉన్న( potentiality) సామర్థ్యం ని మనమే విశ్వసించడం లేదు .మనమీద మనకి ఎందుకు నమ్మకం లేదు అంటే సెల్ఫ్ లవ్ లేదు.self love అంటే  believing yourself.Loveఅంటే knowing yourself self loveఅంటే believing yourself.

        ఆనందం--క్షమాగుణం                    క్షమాపణ ద్వారా మీరు ఆనంద స్థితిని పొందుతారు. అది ఎలా అంటే మీరు క్షమాపణ అడగడం మరియు క్షమించడం అనే ఈ ప్రక్రియలో   ఏం జరుగుతుంది అంటే మొదట మీరు రియలైజ్ అవుతారు, తర్వాత  Belief system ని break చేస్తారు, తరువాత surrender అవుతారు. రియలైజ్ అవ్వడం ద్వారా ప్రేమని తెలుసుకుంటారు .Belief system   ని బ్రేక్ చేయడం ద్వారా క్షమాగుణాన్ని ఎక్స్పీరియన్స్ అవుతారు. సరెండర్(surrender) అవడం ద్వారా సహనం అంటే మీ సోల్ ఎనర్జీని మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు .అందుకే సోల్ మిషన్ వరల్డ్ లో ఉన్న forgive ఆడియో మీలోని ప్రేమని, క్షమాగుణాన్ని, సహనాన్ని మీరు ఎక్స్పీరియన్స్ అయ్యేలా చేస్తుంది. ఎల్.ఎఫ్.పి యోగా టెక్నిక్స్ అనేవి ఈ మూడింటిని మీలో cultivate చేసుకోవడానికి మరియు ఫిజికల్ గా implement చేయడానికి ఉపయోగపడతాయి.Forgive అంటే connecting with yourself.self forgive అంటే surrender to yourself.

              సహనం--విశ్వాసం

సహనం అంటే నీతో నువ్వు ఉండటం .అయితే ఇక్కడ నువ్వు ఎవరు అని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరికీ సంబంధంలేకుండా ఎవరికీ బాధ కలిగించకుండా మన పని మనం చేస్తూ పోవడం కాదు ,నీలో ఏముందో గమనించడమే నీతో నువ్వు ఉండటం. నీలోనే ప్రకృతి, వికృతి, ప్రళయం ,విళయం, లయం, పంచభూతాలు అన్నీ ఉన్నాయి .నీతో నువ్వు ఉండటం అంటే నువ్వు ఎవరు నీ నిజస్థితి ఏమిటి అని తెలుసుకొని దానితో ఉండటం.self love,self forgive ఉన్నప్పుడు సహనం(patience) అంటే సోల్ ఎనర్జీని ఎక్స్పీరియన్స్ చేస్తావు.Dark side lessons,Light side lessons రెండింటిని నువ్వు ఒకే స్థితిలో అనుభవించేలా చేసేది సహనం. నువ్వు విశ్వసించినప్పుడు మాత్రమే నువ్వు పూర్తిగా నీకు అంటే నీలోని పరమాత్మకు సరెండర్ అయినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది.

L.F.P yoga అనేది నువ్వు ఎవరు, నీ నిజస్థితి ఏమిటి అనేది నీకు తెలియజేసి ,నువ్వు దానిని విశ్వసించేలా చేసి నీ యొక్క సోల్ ఎనర్జీని పెంచి, నీకు నువ్వు సెల్ఫ్ హీల్ చేసుకునేలా చేస్తుంది. L.F.P yoga techniques self healing techniques. Patience అంటే being yourself ఈ patience సోల్ ఎనర్జీ కింద convertఅవ్వాలి అంటే faith in yourself faith on L.F.P yoga.

(Message from lord krishna)

త్రిగుణాలు, త్రిలోకాలు, త్రిశక్తులు (బ్రహ్మ,విష్ణు,మహేశ్వరుడు) ఈ మూడు శక్తులలో అంటే Body,Mind,Soul లలో త్రిగుణాలను నింపుకొని త్రిలోకాలను చూడవచ్చు. తద్వారా పంచకోశాలు, పంచభూతాలు శుద్ధి జరుగుతాయి, సమతుల్యం అవుతాయి. త్రి+పంచ అంటే3+5=8 మొత్తంగా శరీరం,మనసు,ఆత్మ,లోపల మరియు బయట పంచభూతాల శుద్ధి జరిగితే అష్ట సిద్ధులు కలుగుతాయి. శక్తులు మన లోపల ఉంటే సిద్ధులు కలుగుతాయి అనుకుంటారు, కానీ అసలు విషయం ఏమిటంటే సిద్ధులు మనలోనే ఉంటాయి బయటనుండి శక్తులు వచ్చి కలిసినప్పుడు మనలోని సిద్ధులు అంటే మనలోని సామర్థ్యం అనేది బయటకు వస్తుంది.అయితే ఈ శక్తులు మరియు సిద్దులు అనేవి lowest form of spirituality.The highest form of spirituality is KNOWLEDGE. Right knowledge in right way will takes you to the peaks of spirituality.శక్తి,సిద్ధి,జ్ఞానం ఒక దశలో  జ్ఞానం కూడా ఆధ్యాత్మికత కాదు. ఆధ్యాత్మికత అంటే నువ్వు అవును ఆధ్యాత్మికత అంటే కేవలం నువ్వు మాత్రమే. నిన్ను నువ్వు తెలుసుకోవడం,నిన్ను నువ్వు వెదకటం,నిన్ను నువ్వు శోధించడం, నిన్ను నువ్వు ప్రశ్నించడం,నిన్ను నువ్వు ఆవిష్కరించడం ఇలా నిన్ను నువ్వు చేరుకోవడానికి నీకు ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి. అంతేకానీ  జ్ఞానమంటే ఆధ్యాత్మికత కాదు. అన్ని కోణాలలో నిన్ను నువ్వు చేరుకొని అసలు ఉన్నది నేను కాదు చేసేది ,చేయించేది ఆ పరమాత్మ అని తెలుసుకోవడమే అసలైన ఆధ్యాత్మికత.ఈ సృష్టి మొదలు నుండి ఇప్పటివరకు ప్రయత్నిస్తూనే ఉన్నాను జ్ఞానం, శక్తులు,సిద్ధులు,ఆధ్యాత్మికత ఇవన్నీ చూడడానికి ఒకేలా కనిపించినా ఇవి పూర్తిగా వేరు అని. ఇప్పుడు సోల్ మిషన్ వరల్డ్ ద్వారా ఎల్.ఎఫ్. పి యోగ ను భూమి మీదకు తీసుకురావడానికి కారణం ఏమిటంటే,నీ గురించి నువ్వు తెలుసుకుంటే ఆధ్యాత్మికత అంటే ఏమిటో తెలుసుకున్న ట్లే అని చెప్పడానికి అతి సులువైన మార్గాలు ఈ  L.F.Pయోగా టెక్నిక్స్. వీటిని సాధన చేయడం ద్వారా నిన్ను నువ్వు healచేసుకోవడమే కాదు ఈ భూమి కూడాheal అవుతుంది తద్వారా ఈ భూమి యొక్క భారం తగ్గుతుంది. కర్మల తీవ్రత తగ్గుతుంది. ప్రేమ, క్షమాగుణం,సహనం,కరుణ ఈ నాలుగు నీలో ఉంటే నాలుగు దిక్కులలో నీకు నువ్వే రాజు వి. రాజు అంటే  ఆజ్ఞాపించే వాడు కాదు అర్థం చేసుకునే వాడు, ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది అని అంటారు కదా ఆ నాలుగు ఇవే ప్రేమ,క్షమాగుణం,సహనం,కరుణ. భూమిపై ఇప్పుడున్న పరిస్థితి ఇలాగే కొనసాగితే సామూహిక కర్మలు ఎక్కువవుతాయి.

ఈ భూమిపై ఎన్నో రకాల జీవులు ఉన్నాయి,అన్నిటికంటే ఉత్తమమైన  ప్రాణి మానవుడు.మానవుడు అన్ని రకాల జీవులను అలాగే భూమిని దాటి ఉన్న అన్ని తరంగాలలో వారిని(Gurus,Masters,Gods)అందరిని ఎక్స్పీరియన్స్ అవ్వ గలడు.అది ఎలా అంటే ఈ సృష్టిలో ఉన్నది మరియు లేనిది అంటే, అనంతం అంతా కూడా అంటే అన్ని రహస్యాలు మానవుడిలో నిక్షిప్తం అయి ఉన్నాయి.అందుకే నీ గురించి నువ్వు తెలుసుకుంటే అంతా తెలుసుకున్నట్లు అని ఆధ్యాత్మికత చెబుతుంది. ఎందుకంటే ఉన్నదంతా నీలోనే ఉంది,ఆధ్యాత్మికత అనంతమైనది నువ్వు వెతుకుతున్న కొద్ది దొరుకుతూనే ఉంటుంది,ఈ ప్రయాణంలో ఎందరో వెనుతిరిగారు మరికొందరు మధ్యలోనే ఆగిపోయారు.ఎక్కడ ఎవరు కూడా విశ్వాసం కోల్పోకూడదు అని మీ గురించి మీరు తెలుసుకోవడమే ఆధ్యాత్మికత అని చెప్పాము. బయట వెతికితే అలసిపోతారు అలాగే విశ్వాసం కోల్పోతారు. సింపుల్ గా చెప్పాలి అంటేTalk to yourself Listen to yourself Forgive yourself Love yourself then world loves you.

మన జీవితంలో ఉన్న సమస్యలన్నింటినీ చూసి ఆ సమస్యలు,మనం ఒక్కటే అని భావిస్తాము.కానీ నిజానికి సమస్య వేరు మనం వేరు,అది ఎలా అంటే సమస్యలు అనేవి నీ కర్మలను ఆధారంగా చేసుకొని వస్తాయి. ఒకవేళ నీవు నా కర్మలు నేను 2 ఒక్కటే అనే భావనతో ఉంటే వాటిని ఇంకా ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తావు,ఎప్పుడూ మైండ్ లోనే ఉంటావు.నీ జీవితంలో ప్రతి సమస్య ఎందుకు వస్తుంది అంటే నిన్ను ఆత్మ పథంలో నడిపించడానికి ఈ చిన్న సత్యం అందరూ అర్థం చేసుకుంటే అసలు సమస్య అనేది ఉండదు.

                 భక్తి--ముక్తి

భక్తి అనేది మనలో ఉంటే అది మనలను ముక్తి వైపుకు తీసుకొని వెళుతుంది అనుకుంటారు.కానీ అసలు విషయం ఏమిటంటే ముక్తి వైపుకు ప్రయాణం చేయాలి అని మనకు ఉన్న తపన మనలో భక్తిని కలిగించి మనలను ముక్తి వైపుకు ప్రయాణించేలా చేస్తుంది. ముక్తి అంటే మన మనసుని ఆత్మకు అర్పించడం,మోక్షం అంటే మన   ఆత్మను పరమాత్మ కు అర్పించడం.L.F.P యోగ అంటే నీకు నువ్వే అర్పించుకోవడం. అన్ని కాలాలలో,అన్ని యుగాలలో ఎన్నో సాధనా మార్గాలు నీకు దారి చూపించడానికి వచ్చాయి,కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లోL.F.P యోగా అనే సాధనా మార్గాన్ని మీముందుకు తీసుకు వచ్చాము. ఎందుకంటే నీ యొక్క కర్మలను అలాగే భూమి యొక్క భారాన్ని తగ్గించడానికి ఇదే సులభమైన మార్గము.ఇక్కడ ఉన్న సోల్ హీలింగ్ టెక్నిక్ నీ pastlife కర్మలను క్లియర్ చేస్తుంది,మరియు నీలో ఉన్న కారణాన్ని తీసివేస్తోంది. శివశక్తి హీలింగ్ టెక్నిక్ అనేది presentlife కర్మలను క్లియర్ చేస్తుంది,మరియు నీలో ఉన్న

ఎఫెక్ట్ ని తీసివేస్తుంది,Forgive అనేది సామూహిక కర్మల నుండి నిన్ను రిలీజ్ చేస్తుంది,మరియు నీలో క్షమాగుణాన్ని నింపుతుంది. సోల్ మిషన్ వరల్డ్ ద్వారా ఎల్.ఎఫ్.పి యోగా టెక్నిక్స్ ద్వారా నిన్ను నువ్వు తెలుసుకోని నీ జీవితంలో ఉన్న కారణం మరియు ఎఫెక్ట్ ని తొలగించుకుని నీ కర్మలను నువ్వే క్లియర్ చేసుకుంటావు. ఎల్. ఎఫ్.పి యోగ నిన్ను Dependent నుండిIndependent ని చేస్తుంది. నీ మీద నీకు విశ్వాసం ఏర్పడేలా చేస్తుంది.self love,self practice,self healing లను నీలో impliment చేస్తుంది.Practice well Love yourself love all Forgive yourself forgive all.Awake the child in you.

No comments:

Post a Comment

✨Suresh Neelam ✨

 ✨Suresh Neelam ✨ A lightworker, soul guide, and channel of divine symbols 📜 “Suresh Neelam is not just a teacher; he is the flame that rem...