*Soul Mission World*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*(Love means Knowing yourself)*
నిన్ను నువ్వు తెలుసుకోవడం
👉 *విశ్వశక్తి*(cosmic energy) మరియు *దైవ శక్తి* (divine energy) మనలో పెంపొందించినప్పుడే మన *ఆత్మ శక్తి* ( Soul Energy) పెరుగుతుంది.
విశ్వశక్తి అంటే *విశ్వాత్మ* (Universal Soul) నుండి వచ్చే శక్తి.
దైవ శక్తి అంటే *సామూహిక ఆత్మల* ( Collective Souls) నుండి వచ్చే శక్తి. *ఆత్మ శక్తి* (self soul ) అంటే మన ఆత్మ నుండి వచ్చేది.
విశ్వశక్తి అంటే *ప్రేమ.*
దైవ శక్తి అంటే *క్షమా.*
ఆత్మ శక్తి అంటే *సహనం.*
*Love + forgive = patience*
*ప్రేమ*( cosmic energy ) + *క్షమ*(Divine Energy)= *సహనము* ( Soul Energy)
విశ్వశక్తి ద్వారా మనలో *స్వయం ప్రేమ* (Self love)మరియు *ఇతరుల పట్ల ప్రేమ* (Love all) కలుగుతుంది. మనలోని *బలహీనతలని*(weakness) మరియు *బలాన్ని*(Strength) రెండు స్థితులని సంపూర్ణంగా అంగీకరించగలుగుతాము(Acceptance) బలాన్ని గుర్తించి బలహీనతలని కప్పిపుచ్చుకోవడం వల్ల అది ప్రేమ అని పిలవబడదు. బలాన్ని, బలహీనతని రెండింటి ని అర్థం చేసుకొని అంగీకరించినప్పుడే (Acceptance) అది *దివ్యమైన ప్రేమ* (Unconditional Love). అలాగే ఇతరుల లో ఉన్న బలహీనతలను మరియు బలాన్ని అంగీకరించినప్పుడు (Accep )వారి పట్ల మనకు ప్రేమ (Love all)ఉన్నట్టు.
ప్రేమ వల్ల అంగీకారతత్త్వం మనలో పెరిగి మన స్థితి ఎలా ఉంటే అలా గుర్తించగలుగుతాము. అలాగే ఇతరులను కూడా వాళ్ల స్థితి బట్టి మనము గుర్తిస్తాము.ఇలా చేసినప్పుడు మన పట్ల మనకు ఇతరుల పట్ల విభేదాలు, ద్వేషాలు ఉండవు. అప్పుడు సంపూర్ణమైన ప్రేమతత్త్వంతో జీవితాన్ని ఆనందిస్తుంటాము. ద్వంద్వాతీత స్థితి (Duality) నుండి ఏకత్వంలోకి (oneness) చేరుకుంటాము. ఈ స్థితిని నో జడ్జిమెంట్ (No Judgement). అంటారు .ఎవరైతే జీవితాన్ని సంపూర్ణంగా ఆనందింస్తుంటారో (Enjoyment) వాళ్లు దివ్య జ్ఞాన ప్రకాశవంతులు (Enlightenment).
ప్రేమ అంటేనే నిన్ను నువ్వు సంపూర్ణంగా తెలుసుకోవడం.
ప్రేమ లోపించడం వల్ల మన శరీరంలో శక్తి ప్రవాహం సరిగ్గా జరగకపోవడం వల్ల మానసికంగా ఎంతో అలసిపోయి ఎన్నో నకరాత్మకమైన భావోద్వేగాలు, భయము, ద్వేషము పెరిగి మనలో రోగనిరోధక శక్తి లోపించడం జరుగుతుంది. తద్వారా ఎన్నో మానసిక మరియు శారీరిక రుగ్మతలను పొందుతాము.
కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు పెరుగుతాయి.
ఒక పిల్లవాడు జాతరలో తల్లిదండ్రుల నుండి తప్పిపోయినప్పుడు ఎలాగైతే భయము , అభద్రతతో ఉంటాడో. మనలో ప్రేమలోపించినప్పుడు మనం కూడా భయము,అభద్రతతో ఉంటాము.
ప్రేమ ఉన్నచోట *స్వేచ్ఛ*(Freedom) ఉంటుంది.
స్వేచ్ఛ ఉన్నచోట *సంపద*(Abundance) ఉంటుంది.
Law of Love means Law of freedom.
Law of freedom means Law of Abundance.
ప్రేమ అంటే స్వేచ్ఛ.
స్వేచ్ఛ అంటే సంపద.
అందరూ ప్రేమతో ఉండాలి అందర్నీ ప్రేమించాలని చెప్తూ ఉంటారు కానీ అది సాధ్యం కావడం లేదు.
*ఎల్. ఎఫ్. పి యోగ* సాధన (LFP yoga) ద్వారా ప్రేమ తత్త్వాన్ని పెంపొందించుకోవడం సాధ్యమవుతుంది.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
*(Forgive means connecting to youself)*
నీతో నువ్వు అనుసంధానం కావడం
👉 *క్షమా* లేదా క్షమా గుణం (Forgive) అంటే దైవ శక్తి(Divine Energy )
మనలో *క్షమాగుణం*(Forgive) లోపించినప్పుడు ఎందరినో మానసికంగా మన మనసులో వారితో జీవిస్తూ ఉంటాము.
మనలో మనం జీవించకుండా గతంలో ఎవరితో అయితే మనకు కర్మ ఉందో వారితో ఏర్పడిన భావోద్వేగాలతో (Emotions) మనలో ఉన్న శక్తి వృధా అవుతూ మానసికంగా ఎంతో బలహీనంగా తయారవుతాము.
క్షమాగుణం లోపించడం వల్ల మనము ఎందరితో మానసిక బంధం ఏర్పరచుకొని పదేపదే వారిని లేదా ఆ సంఘటనలను నెమరేసుకుంటూ ఇంకా దృఢమైన కర్మ బంధాన్ని ఏర్పరచుకొని మానసికంగా వాళ్ల తాలుకు జ్ఞాపకాలు, సంఘటనలు *వదిలేయలేక*(Let go) ఎంతో అంతర్ ఘర్షణకు లోనఅవుతూ మానసిక ప్రశాంతత కోలిపోతున్నాము. ఆలోచనల యొక్క తీవ్రత పెరిగి అలజడి, కోపము, ద్వేష భావోధ్వేగాలతో జీవిస్తూ ఉంటాము.
ఎవరితో అయితే మనకు కర్మబంధము ఏర్పడుతుందో వారికి మనకు మధ్యలో ఎన్నో *ఎనర్జీ కార్డ్స్*(Energy cords) ఏర్పడతాయి. ఈ ఎనర్జీ కార్స్ వల్ల మనలోని శక్తి వారికి చేరుకుంటూ ఇంకా మన యొక్క కర్మ తీవ్రతని (karma intensity) పెంచుకుంటూ ఉంటాము.
ఉదాహరణకి: కుండకి రంద్రాలు ఉన్నప్పుడు మనము దానిలో నీళ్లు పోసినప్పుడు ఎలా అయితే రంద్రాల ద్వారా నీరు బయటకు వెళ్లి పోతుందో .అలాగే మనకు ఎవరితో అయితే ఎనర్జీ కార్డ్స్ ఏర్పడతాయో మన ఎనర్జీ కూడా అలా బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు ఎలాంటి సంకల్పం గాని ,కోరిక కానీ పెట్టుకున్నా అది నెరవేరదు. మనము మన భౌతిక జీవితంలో ఏదైనా పొందాలి అంటే మానసిక శక్తి అవసరము. మనము ఇలాంటి సందర్భంలో నేను ఏది చేసినా, ఏది అనుకున్న నాకు జరగట్లేదు అని నిరుత్సాహంతో, నిస్పృహతో జీవితాన్ని గడుపుతాము
మనలో క్షమాగుణము వికసించినప్పుడు మనము మనతో కర్మ ఉన్న వ్యక్తులని మానసికంగా , హృదయపూర్వకంగా క్షమాపణ అడిగినప్పుడు ఆ ఆత్మ మనలోని అజ్ఞానాన్ని అర్థం చేసుకొని మన క్షమాపణని అంగీకరించినప్పుడు మనకు ఆ ఆత్మ నుండి *దీవెనలు* (Blessings) అందుతాయి. ఈ దీవెనలే మనము *దైవ శక్తి* (Divine Energy)అంటాము.
Everybody shows intrest in bank balance.
Nobody shows intrest blessings balance.
ఒక విత్తనాన్ని మనము భూమిలో పాతిపెట్టినప్పుడు. ఎలా అయితే ఆ విత్తనము మొలకెత్తి బయటికి రావడానికి వెలుగు, నీరు, గాలి, భూమి ,ఆకాశము మరియు దాని చుట్టూ కంచ ఎలా సహకరిస్తాయో. అలానే ఒక ఆత్మ ఎదగాలి అంటే తనతో కర్మ బంధాలు ఉన్న ఆత్మలు మరియు ఇతర ఆత్మలు అంగీకరించి దీవించినప్పుడే కర్మల నుండి విముక్తి అయ్యి మానసికంగా ఆలోచన రహిత స్థితి చేరుకొని ప్రశాంతంగా, శాంతితో జీవిస్తాము.
కర్మ ఉన్న ఆత్మలు మనల్ని క్షమించకపోవడం వల్ల
శక్తి క్షీణించి అజ్ఞానం, అహంకారంలో పడి ఆత్మజ్ఞానాన్ని పొందలేక జీవిత లక్ష్యాన్ని తెలుసుకోలేక సతమతమవుతూ బ్రతుకుతూ ఉంటాం.
మనము ఎన్నో జన్మలలో ఎందరితో కర్మ బంధాలను ఏర్పరచుకొని ఉన్నాము.
మొబైల్ ఫోన్లో వీడియోని వీక్షిస్తున్నప్పుడు ఆకస్మాత్తుగా మీ యొక్క సాఫ్ట్ వేర్ ని అప్ డేట్ (Software update) చేసుకోమని అడుగుతుంది. అప్పుడు మనము సాప్ట్ వేర్ అప్ డేట్ (Software update అని క్లిక్ (click) చేస్తాము.
మెయిన్ స్క్రీన్ (Front end) మీద వీడియో చూస్తూ ఉంటాము దాని వెనకాల (Back end) సాప్ట్ వేర్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. కొంతసేపటికి మనము సాప్ట్ వేర్ అప్ డేట్ అవుతున్న విషయాన్ని మర్చిపోతాము. వీడియో చూస్తున్నందుకు బ్యాటరీ అలానే డాటా(Internet) అయిపోతూ ఉంటుంది. బ్యాక్ ఎండ్లో సాప్ట్ వేర్ అప్ డేట్ అవడం వల్ల బ్యాటరీ మరియు డాటా అయిపోతుంది.
చేతన మనసులో( conscious mind) మన ఆలోచనలను మనము అడ్డుకుంటూ నాకు ఎలాంటి ఆలోచనలు లేవు అని అనుకొని ఉంటాము. మన అంతః చేతన మనసులో( subconscious mind) అలానే అచేతన మనసులో (unconscious mind) *ప్రారబ్ధ* మరియు (present life karmas) *సంచిత* ( pastlife karmas ) కర్మల యొక్క వల్ల మానసిక శక్తి ,ఆత్మ శక్తి క్షీణించడం జరుగుతుంది.
క్షమాగుణం వల్ల *అంతర్ ప్రపంచం శుద్ది చెంది మన అంతర్ ప్రపంచ లో అభివ్యక్తి పెరుగుతుంది.
మనలో క్షమాగుణం వికసించినప్పుడు *దివ్యమైన ప్రేమ* వికసించడం జరుగుతుంది.
ఆనందమైన జీవితాన్ని జీవించాలంటే. జీవితంలో అనవసరమైనవి లేదా మన ఆత్మ ఎదుగుదలకు కానివి వదిలేయడం ( LET GO) నేర్చుకోవాలి. వదిలేయడం అనేది క్షమాగుణం సాధన ద్వారా కలుగుతుంది.
క్షమా గుణం వల్ల మన అనవసరమైన గతాన్ని మరియు భవిష్యత్తు గురించి బెంగ వదిలేయడం జరుగుతుంది.
*క్షమా* (Forgive) సాధన చేయడం వల్ల మనలో *పశ్చాతాపం* (Repentance) మరియు *ప్రాయశ్చిత్తము* (Atonement or dissolving Karma) జరుగుతాయి.
క్షమాగుణం వల్ల బంధము (attachment) నుండి బంధ విముక్తులమవుతాము (detachment).
అందరూ క్షమాగుణం కలిగి ఉండాలి. క్షమాగుణంతో జీవించాలి .అందరి పట్ల క్షమాగుణం చూపించాలని చెప్తూ ఉంటారు కానీ దాన్ని పెంపొందించుకోవడానికి యోగ సాధన విధానాన్ని ఎవరు చెప్పలేదు.
ఎల్. ఎఫ్. పి యోగ (LFP yoga) సాధన ద్వారా మనలో క్షమాగుణం పెంపొందించుకోవాలని ప్రేరణ కలిగి క్షమాగుణం సాధన చేస్తాము.
💚💚💚💚💚💚💚💚💚💚💚
*(Patience means Being yourself)*
నీలో నువ్వు ఉండడం.
👉 *సహనము* (patience) అంటే *ఆత్మశక్తి* (Soul Energy).
*ప్రేమ* మరియు *క్షమా* ఎప్పుడైతే మనలో పెంపొందించబడతాయో అప్పుడు మనలో *సహనము* (soul energy) పెరుగుతుంది.
ప్రేమ వల్ల *విశ్వశక్తి* ని పెంపొందించుకొని, క్షమా వల్ల *దైవ శక్తి* ని పెంపొందించుకొని ఈ రెండిటి ద్వారా మనలో *ఆత్మ శక్తి* ని పెంపొందించుకొని. ఈ ఆత్మశక్తిని ఆధారం చేసుకుని మనము ఎదుర్కోవాల్సిన కర్మలని, నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలని ,తీసుకోవాల్సిన అనుభవాలన్నీ అన్నిటిని పొందుతాము.
ఆత్మ శక్తి మనల్ని మానసికంగా, శారీరికంగా, బుద్ధి మరియు శక్తి పరంగా సిద్ధం చేసి కర్మలు ఎదుర్కోవడానికి లేదా వాటి యొక్క తీవ్రతని తగ్గించుకొని జీవిత అనుభవాలన్నీ పొందే విధంగా చేస్తుంది.
సహనం అంటే ఆత్మస్థితి. ఆత్మస్థితిలో ఉన్నప్పుడు అన్ని అందించబడుతాయనే సత్యాన్ని మనమందరము మర్చిపోయాము. మనసులో ఉన్నప్పుడు ఎప్పుడూ మనము ఏదో ఒకటి కోరుకుంటూ ఉంటాము. కానీ ఆత్మస్థితిలో ఉన్నప్పుడు ఈ ప్రకృతి మరియు విశ్వము మన ఆత్మ ఎదుగుదలకి మరియు భౌతిక ఎగుదలకు ఏది అవసరమో అన్ని అందిస్తూ ముందుకు తీసుకెళ్తుంది.
సహనంతో ఉండడం అంటే ఆత్మస్థితిలో ఉండడమే. ఆత్మస్థితిలో ఉన్నప్పుడు మన ఆత్మ శరీరాన్ని , మనసుని ఆధారంగా చేసుకుని తను పొందావలసిన అనుభవాలను పొందుతూ ఆనందిస్తూ జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ చైతన్యాన్ని విస్తరించుకుంటూ ఎదుగుతుంది.
ఆత్మ శక్తి లోపించడం అంటే మనలో స్వయంప్రేమ (Self Love)మరియు స్వయంక్షమా (Self Forgive) లోపించడమే.
ఆత్మస్థితిలో ఉన్నప్పుడు ఆత్మకు గురించి కానీ మరియు ఆధ్యాత్మికతను సరిగ్గా అర్థం చేసుకుంటాము.
ఈరోజు సమాజంలో చాలా వ్యక్తులలో ప్రేమ , క్షమా లోపించడం వల్ల ఆత్మను గురించి సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల ఆధ్యాత్మిక వైపు ఆసక్తి చూపించట్లేదు.
ఎక్కడైతే ఆత్మ జ్ఞానం ((Soul knowledge) ఉంటుందో అక్కడ సంపద ఉంటుందని మనమందరము తెలుసుకో లేక పోతున్నాము
ఆత్మస్థితి అంటే దివ్య చైతన్యం (Super Conscious). మనమందరము దివ్య చైతన్యం నుండి భౌతిక మాయలో పడి అంతః చేతన స్థితికి (Subconscious ) చేరుకుంటున్నాము.
ఆత్మ స్థితిలో ఉండి మనము ఏ పని చేసిన కర్మబంధము అంటుకోదు.
చేతన మనసు నుండి చైతన్యం వైపు మన ప్రయాణం.
(Conscious to Consciousness).
Talk to yourself
Listen to yourself
Forgive yourself
Love yourself
Then World loves you
నీ ఆత్మతో నువ్వు సంభాషించు.
నీ ఆత్మ చెప్పేది విను.
నిన్ను నువ్వు క్షమించు
నిన్ను నువ్వు ప్రేమించు.
అప్పుడు ప్రపంచం నిన్ను ప్రేమిస్తుంది.
ఎల్. ఎఫ్ .పి యోగ ద్వారా ఆత్మస్థితికి చేరుకోవచ్చు.
ఎల్ .ఎఫ్. పి యోగాలో రేఖాగణిత శాస్త్రంలో ని(Geometric science) . కొన్ని ప్రత్యేకమైన చిహ్నాలు ( symbols) ద్వారా నేర్పించబడుతుంది.
ఎల్ .ఎఫ్ .పి యోగ ద్వారా మనలో కుండలిని ఆక్టివేట్ చేసుకోగలరు. చక్రాలను శుద్ధి చేసుకుని బ్యాలెన్స్ గా ఉంచుకోగలుగుతారు. వాస్తు, కాలసర్ప, గ్రహ, పితృ దోషాలని, కుటుంబ ,వ్యాపార , ఆరోగ్య , ఆస్తి సమస్యలను సంపూర్ణంగా హీలింగ్ చేసుకొని తొలగించుకోవచ్చు.
ఆత్మ, మనసు ,శరీరము ,ఆరా, చక్రా సంపూర్ణంగా హీలింగ్ చేసుకోవచ్చు
👏👏👏👏👏👏👏👏👏👏
Your
Love & Light
SOUL MISSION WORLD
No comments:
Post a Comment