Friday, April 29, 2022

Know LFP yoga

 ప్రేమ అంటే విశ్వశక్తి.

క్షమాపణ అంటే దైవ శక్తి.

సహనం అంటే ఆత్మశక్తి.


ప్రేమ అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం.

క్షమాగుణం అంటే నీతో నీవు అనుసంధానం కావడం.

సహనం అంటే నీతో నువ్వు ఉండటం .


ప్రేమ అంటే భక్తి.

క్షమాపణ అంటే ప్రార్ధన.

సహనం అంటే ఆరాధన.


నీ ఆత్మ పట్ల నీకు భక్తి ఉండాలి.

నీ ఆత్మ గురించి నువ్వు ప్రార్థన చేయాలి.

నీ ఆత్మ పట్ల నీకు ఆరాధన కలిగి ఉండాలి.


భక్తి, ప్రార్థన, ఆరాధన ఈ మూడింటిని మనలో ఉన్న ఆత్మ పట్ల పెంపొందించుకోవాలి.


కానీ  బయట ఈ మూడింటిని చేయడంవల్ల పెద్ద ఉపయోగం లేదు.


ఈ మూడు మన లోపల లోపించడం వల్ల మనము మన ఆత్మకు దూరం అవుతున్నాము.


మన ఆత్మకు దూరం అవడం వల్ల అశాంతిని, భయాన్ని, ఆందోళనని, స్వార్థం, ఈర్ష, పెంచుకొని, రోగనిరోధక శక్తి తగ్గించుకుని అనారోగ్య పాలవుతున్నాము. జీవిత లక్ష్యం వైపు, ఆత్మ లక్ష్యం వైపు సరైన అవగాహన లేకపోవడం జరుగుతుంది. జీవితంలో దుఃఖాన్ని అనుభవిస్తున్నాము.


నీలో కొలువై ఉన్న దివ్య ఆత్మ స్వరూపాన్ని, ఆత్మ నారాయణుని, ఆత్మలింగాన్ని పట్ల భక్తిని, ప్రార్ధన ని, ఆరాధన ని పెంపొందించుకోవడానికి  ఎల్ .ఎఫ్ .పి యోగ (LFP YOGA) మార్గము ఇవ్వబడింది.


ఈ యొక్క ఎల్. ఎఫ్. పి‌ యోగ ని ప్రపంచం మొత్తానికి అందించడానికి సోల్ మిషన్ వరల్డ్ ప్రయత్నం చేస్తోంది.


ఈ ఎల్ ఎఫ్ పి యోగాన్ని సాధన చేయడం వల్ల శరీరము, మనసు, ఆత్మ అనుసంధానము ఏర్పడి జీవిత లక్ష్యం వైపు మరియు ఆత్మ లక్ష్యం వైపు సునాయాసంగా చేరుకోవడం జరుగుతుంది.


జీవిత లక్ష్యం అంటే భౌతికంగా పొందవలసిన, అనుభవించ వలసినవి అన్ని నెరవేరడం.


ఆత్మ లక్ష్యం అంటే మనము భూమ్మీద   ఏం నేర్చుకోవడానికి వచ్చాము, ఏం తెలుసుకోవడానికి వచ్చామ.


Soul Mission World.

No comments:

Post a Comment

25 Deep Astral Tests in the Astral Realms

 25 Deep Astral Tests in the Astral Realms These astral tests are not merely symbolic—they are energetic initiations encountered by the soul...