SOUL MISSION WORLD
జ్ఞానం ఎలా ఆర్జించాలో అందరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం ఈ భూమి మీదకు వచ్చిందే అందుకు, జ్ఞానం సంపాదించటం అంటే మన గురించి మనం తెలుసుకోవడమే! (knowing your self) దీనినే "ప్రేమ" అని కూడా అంటారు. ఇక్కడ నువ్వు... అంటే "ఆత్మ" అని అర్థం. నీ ఆత్మ గురించి తెలుసుకోవాలంటే నువ్వు ఆ స్థితికి వెళ్లాలి. ఆత్మ స్థితికి వెళితేనే నువ్వు ఆత్మ గురించి తెలుసుకోగలవు. నువ్వు ఆత్మస్థితికి వెళ్లాలంటే నీ మైండ్ ని ముందుగా దాటవలసి ఉంటుంది. "Mind" ని దాటడం అంటే అంత సులభం కాదు. నీవు నీ Mindని వదిలేస్తేనే అది సాధ్యమవుతుంది. Mindని దాటాలంటే నువ్వు ఏర్పాటు చేసుకున్న నమ్మక వ్యవస్థలను మరియు ఎన్ని ఆత్మలతో అయితే నీకు కర్మలు ఉన్నాయో, వాటిని తొలగించుకోవాలి. ఇలా తొలగించుకోవడమే "క్షమాగుణం" (Connecting with yourself). వీటన్నింటినీ తొలగించుకున్నాక నీవు
చేరుకునేదే! ఆత్మ స్థితి దానినే "సహనం" (being with yourself) అంటారు.
అందరు కూడా "సహనం" అంటే తప్పుగా అర్థం చేసుకున్నారు! ఎంత కష్టమైనా అనుభవించడం, సహనం అని అంటారు. కానీ అసలైన అర్థం ఏమిటంటే! ఎంత కష్టం నుంచి అయినా ఆనందంగా అనుభవాలను తీసుకోవడమే "సహనం". ఎందుకంటే ఆత్మలో ఉంటే నువ్వు పొందేదే 'ఆనందం', అదే నీ నిజ స్థితి. ఆనందంలో ఎందరో యోగులు ఎన్నో యుగాలుగా ఆత్మతో రమిస్తూ ఉంటారు. అదే నిజమైన సహనం.
నేను "LFP యోగ" సాధన చేసే సమయంలో నా ఆత్మ దగ్గర నుండి నేను ఒక అనుభవాన్ని పొందాను. దానిని మీతో పంచుకుంటాను. ఒక రోజు నేను Bike నడుపుతున్నప్పుడు నేను ఎటు చూసినా నాకు నేను కనిపిస్తున్నాను. అన్నింటిలో నన్ను నేనే చూసుకుంటున్నాను. నాకు ఈ అనుభవం కొత్తగా అనిపించింది, అప్పుడు నా ఆత్మని ఇలా అడిగాను. ఎందుకు ఇలా కనిపిస్తుంది అని! నా ఆత్మ నాకు చెప్పిన సమాధానం ఏమిటంటే! ఇప్పుడు నువ్వు చూసినది అంతా కూడా నిజమే! ఇదంతా నేను సృష్టించినదే, నేనే ఈ విశ్వాన్ని, నేనే ఈ ఆట ఆడుతున్నాను. నేనే ఎన్నో లోకాలను సృష్టించాను. అందులో ఈ భూమి కూడా ఒకటి. ఈ భూమి మీద నేను ఒకే శరీరం తో ఉంటే ఏమి నేర్చుకోలేనుగా,
అందుకే ఎన్నో శరీరాలుగా జన్మ తీసుకొని అన్నిటి నుంచి అనుభవాలు తీసుకుంటున్నాను.
ఇక్కడ పంచభూతాలను సృష్టించి వాటితోనే శరీరాన్ని సృష్టించి ఆ శరీరానికి ఇంకొక 6 శరీరాలను జోడించాను, ఆ శరీరంలో బుద్ధిని, మనస్సును, శక్తిని, ఇచ్చి నడుపుతున్నాను. అంతేకాక ఒకరికి మరొకరికి "కర్మ"ని అంటించి అనుభవాలను పొందుతున్నాను. ఒక జన్మలో దొంగగా జన్మ తీసుకుంటాను, మరొక జన్మలో యోగిగా జన్మ తీసుకుంటాను, ఒకసారి రాముడిగా, మరొకసారి రావణాసురుడిగా జన్మ తీసుకుంటాను, ఇది అంతా కూడా నేను ఆడే ఒక ఆట, ఎన్నో జన్మలలో ఎన్నో రకాలు గా జన్మలను తీసుకుంటూ ఉన్నాను అలాగే ఉంటాను కూడా.
ఈ విధంగానే నేనే సృష్టిస్తాను, నేనే అనుభవిస్తాను, నేనే నాశనం చేస్తాను. సృష్టించే సమయంలో నేను "బ్రహ్మని", అనుభవం తీసుకునే సమయంలో "విష్ణువుని", అనుభవం తీసుకున్నాక దానిని లయం చేసే సమయంలో నేను "శివుడిని".
ఒక్కడినే కానీ నేను చేసే లీలలు ఎన్నో... ఇది నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి అంటే నువ్వు "ప్రేమ శక్తిని" ఉపయోగిస్తే 'బ్రహ్మతత్వం' అర్థం అవుతుంది. "క్షమాగుణాన్ని" ఉపయోగిస్తే 'శివ తత్వం' అర్థం అవుతుంది, అలాగే "సహనశక్తిని" ఉపయోగిస్తే 'విష్ణు తత్త్వం' అర్థమవుతుంది, ఇలా ప్రేమ, క్షమాగుణం, సహనం, ఈ మూడు గుణాల ద్వారా నిన్ను నువ్వు గుర్తించగలవు.
LFP యోగాని సాధన చేసే సమయంలో నీలో ఏమి జరుగుతుందో నేను ఇప్పుడు నీకు వివరిస్తాను. ముందుగా విశ్వానికి నీకు అనుసంధానం ఏర్పడుతుంది. తర్వాత విశ్వం నుంచి నువ్వు LFP Energiesని నీలో నింపుకుంటావు. ఇలా నింపుకునే సమయంలో నీ Awareness("ఎరుక స్థితి" లేదా "సాక్షి తత్త్వం") శరీరం నుండి బయటకు వచ్చి, విశ్వం నుంచి నీకు LFP Energies ఎలా వస్తున్నాయో గమనిస్తావు. ఆ సమయంలో Universe ని, నీ శరీరాన్ని ఈ రెండింటికి మధ్యలో ఉన్న శక్తి ప్రవాహాన్ని, సాక్షి తత్త్వం లో ఉండి గమనిస్తావు, ఈ విధంగా నీ లోపల ఎరుక స్థితి అనేది పెరుగుతుంది. అంతేగాక ఈ Universe నుంచి వచ్చే LFP Energies వలన నీ 'కుండలినీ' జాగృతం అవుతుంది. ఈ కుండలినీ శక్తి జాగృతమై నీలోని చక్రాలను దాటుకొని ఆగ్నేయ చక్రానికి చేరి, ఆ చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది. ఇలా చక్రాలను దాటే సమయంలో కొన్ని చక్రాలలో 'Blocks' ఉంటాయి, ఆ 'Blocks' ఉండడం వలన కుండలిని శక్తి చక్రాలను దాట లేకపోవచ్చు! ఈ LFP Energies అనేవి చక్రాల లో ఉన్న 'Blocks'ని తొలగించి శక్తి ప్రవాహాని కి అడ్డంకులను తొలగించి ఆగ్నేయ చక్రానికి అభిషేకం చేస్తాయి, శివలింగానికి ఎలా అయితే అభిషేకం చేస్తామో అలాగే మన కుండలినీ శక్తి 'ఆగ్నేయ చక్రానికి' అభిషేకం చేసి ఆగ్నేయ చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది.
ఈ విధంగా మన ఆగ్నేయ చక్రాన్ని యాక్టివేట్ చేసుకొని 'ఉన్నంత లోకాలకు' కనెక్షన్ ఏర్పరచుకుంటాం. అలా ఉన్నంత లోకాలకు కనెక్షన్ ఏర్పరచుకొని అక్కడ ఉన్న జ్ఞానాన్ని తీసుకొని ఈ భౌతిక ప్రపంచంలో మనం ఏర్పర్చుకున్న ఎన్నో నమ్మక వ్యవస్థలను destroy చేస్తాము.
Note :- చక్రాలలో Blocks అంటే మన యొక్క unlearned, unhealed parts ఈ భూమ్మీదకు మనం పాఠాలు నేర్చుకోవడానికి వస్తాము, ఇలా వచ్చినప్పుడు ఆ పాఠాలను సరిగా నేర్చుకోకుండా, మనకు ఆ పాఠాలు నేర్పించడానికి, వచ్చిన ఆత్మలను ఇబ్బందులు పెడతాము. ఇలా ఇబ్బంది పెట్టినప్పుడు దాని తాలూకా ఉన్న మూలాలు మన లోపల ఉండి పోతాయి వాటినే Unhealed parts అంటాం. మనం ఈ భూమి మీదకు వచ్చి నేర్చుకోవాల్సిన కొత్త పాఠాలను నేర్చుకోకుండా Pending పెట్టిన వాటిని unlearned parts అంటాం. LFP యోగా సాధన చేసేటప్పుడు ఈ రెండింటికి సంబంధించిన పాటాలు బయటకు వస్తాయి. వాటిని మనం "ప్రేమా, క్షమాగుణం" తో వాటిని ఎదుర్కొని అనుభవాలను పొందుతాం. ఈ అనుభవాలనే 'జ్ఞానం' అని కూడా అంటారు. ఈవిధంగా LFP యోగాని సాధన చేసి జ్ఞానాన్ని పొందుతాము.
Note:- unhealed parts నేర్చుకునే సమయంలో మనం కొత్త pain కూడా పొందుతాం. ఎందుకంటే మనం ఇతర ఆత్మలని ఇబ్బంది పెట్టాము కాబట్టి!
ఈ విధంగా సాధన చేసే కొద్దీ నీ మనసుని దాటి నీ ఆత్మని చేరుకోగలుగుతావు. LFP Energies, నీ లోపల నిండిన తర్వాత అవి ఎలా పని చేస్తాయో తెలుసుకుందాం. ఈ energiesని, విశ్వం నుంచి నీవు Receive చేసుకుంటావు, అవి నీ లోపలికి ప్రవేశించి నీ లోపల ఉన్న విశ్వంలోకి చేరుతాయి, (journey from space to empty space between cells).
Memory అనేది mindకి ఉంటుంది ఈ Mind ఎక్కడ ఉంటుంది అంటే, అందరూ బ్రెయిన్ ఉన్న Position ని చూపెడతారు. కానీ Mind, Brain రెండు కూడా వేరువేరు. mind అనేది brain చేత వర్క్ చేయిస్తుంది అసలు మైండ్ అనే పదం లేదు మనలో ఉన్న మనోమయ కోశాన్ని 'mind' అని అనుకుంటాం. ఇది శరీరం అంతా వ్యాపించి ఉంటుంది బ్రెయిన్ కి సందేశాలు మనోమయకోశం నుంచి వెళ్తాయి. మనలోని ప్రతి కణానికి Memory అనేది ఉంటుంది. ఆ కణాలలో ఉన్న Memory నే మనం "మనోమయకోశం" అంటాము. ఇక్కడ Memory అనేది మన యొక్క ఎన్నో జన్మలలో మనం cary చేస్తున్న un wanted memory.
LFP energies అనేవి కణాలలో ఉన్నా un wanted particles మీద పనిచేస్తాయి, ఈ unwanted particles నీ delete చేసి అక్కడ space create చేస్తాయి, ఆ empty space లో ప్రేమ, క్షమాగుణం, సహనం, కి సంబంధించిన energies నీ మరియు knowledges ని నింపుతాయి. ఇలా నింపడం ద్వారా మన భావనలు అనేవి 'ప్రేమపూర్వకంగా, క్షమాగుణ పూర్వకంగా సహనం' గానే కాక అనేక దైవికగుణాలతో జీవింపజేసే లాగా చేస్తుంది . మన ఆలోచనలు ఎలా అయితే ఉంటాయో అలాగే మన "జీవితం" కూడా ఉంటుంది. మనలో దైవిక గుణాలు ( ప్రేమ, క్షమాగుణం, సహనం, కృతజ్ఞత, దయా, కరుణ, నిజాయితీ మొదలగునవి) ఉంటేనే! మన జీవితమంతా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. మనలో రాక్షస గుణాలు (ద్వేషం, కోపం, దుఃఖం, ఈర్ష్య మొదలగునవి) ఉంటే మన జీవితం ఎంతో ఇబ్బందికరంగా మారుతుంది . ఇప్పుడు మన జీవితం ఎలా ఉందో అర్థం అయ్యింది! అనుకుంటున్నాను.
మానవులందరూ ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పాఠాలు నేర్చుకుంటారు, ఎలాగైతే సత్యయుగం(కృతయుగం) లో ఉన్నప్పుడు ఎక్కువగా light side పాఠాలు నేర్చుకుంటారు, అలాగే కలియుగంలో ఉన్నప్పుడు dark side పాఠాలు ఎక్కువగా నేర్చుకుంటాడు. ఇలా సమయాన్ని బట్టి ఎన్నో రకాల పాఠాలను నేర్చుకుంటాడు, ఇప్పటివరకు ఈ భూమ్మీద జన్మ తీసుకున్న గొప్ప గొప్ప Masters అందరూ కూడా సమయాన్ని బట్టి మానవులకు ఏ మార్గంలో అయితే వారి ఎదుగుదలకు ఉపయోగపడుతుందో! దాని ప్రకారం గా ఎన్నో యోగ మార్గాలు అందించారు, నేను తెలుసుకున్న దాని ప్రకారం మనం ఇప్పుడు ద్వాపర యుగం నుంచి త్రేతాయుగం లోనికి అడుగు పెడుతున్నాం. ఇప్పుడు మనం 'యుగ సంధి' లో ఉన్నాం. మనం అందరమూ కూడా 'higher planes'కి shift అవుతున్నాము. మనతో పాటు ఈ భూమి కూడా! అందుకే ప్రస్తుతం ఈ ప్రకృతిలో మరియు మనలో అనేక మార్పులు సంభవిస్తున్నాయి. ఈ మార్పులన్నీ కూడా మనం త్రేతాయుగంలో ఎలా జీవించాలో నేర్పుతున్నాయి.
సత్య యుగం → సత్య యుగం
↑ ↓
త్రేతా యుగం త్రేతా యుగం
↑ ↓
ద్వాపర యుగం ద్వాపర యుగం
↑ ↓
కలి యుగం ← కలి యుగం.
పైన చెప్పబడిన విధంగా మన కాలం అనేది సత్యయుగం నుంచి కలియుగం వైపు నడుస్తుంది, మరలా కలియుగం నుంచి సత్యం యుగం వైపు ప్రయాణం చేస్తుంది. మనం ఇప్పుడు కలియుగం నుంచి సత్య యుగం వైపు ప్రయాణం చేస్తున్నాము, అంటే అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకు అన్నమాట. మనం గమనించినట్లైతే ఇప్పటివరకు వచ్చిన మాస్టర్స్ అందరూ కూడా మనల్ని అజ్ఞానం నుంచి భక్తి వైపుకి నడిపారు, అందుకే భూమి పైన ఎక్కువగా జనాలు భక్తి మార్గం లో ఉన్నారు. ఇక మనం భక్తి మార్గం నుంచి మన ఆత్మ వైపుకు నడవాల్సి ఉంటుంది, ఇలా మన ఆత్మ వైపు నడిపేది "LFP YOGA".
LFP Yoga సాధన చేసిన వారు ఆత్మ స్థితిని తొందరగా పొందగలరు. అది ఎలాగంటే L.F.P అంటే ప్రేమ, క్షమాగుణం, సహనం.
Love (ప్రేమ):- అంటే నీ గురించి నువ్వు తెలుసుకోవడం.
Forgive (క్షమాగుణం):- అంటే నీతో నువ్వు అనుసంధానం కావడం.
Patience (సహనం):- అంటే నీతో నువ్వు ఉండగలగడం.
Note: ఇక్కడ నీ అంటే ఆత్మ అని అర్థం. పైన మూడు కూడా నీ ఆత్మ వైపు ఎలా అడుగులు వేయాలో నీకు తెలియజేస్తాయి.
నువ్వు ఆధ్యాత్మిక ప్రయాణం లో ఉన్నావని అని ఎలా తెలుసుకోవచ్చు అంటే నీవు దేనిని పట్టు కుంటున్నావు! అలాగే దేనిని వదిలిపెడుతున్నావో! నీకు ఒక అవగాహన అనేది ఉంటుంది.
ఇది ఎలా అంటే
-> వేటిని పట్టుకుంటే నీ ఆత్మ ఎదుగుదల జరుగుతుందో!
-> అలాగే వేటిని వదిలిపెడితే, నీ ఎదుగుదల జరుగుతుందో తెలుసుకోగలవు.
Similarly:-
దేనిని పట్టుకుంటే నీ ఆత్మ ఎదుగుదలకు దూరం అవుతావో! అలాగే దేనిని వదిలిపెడితే నీ ఎదుగుదలకు దూరం అవుతావో! నీకు అర్థం అవుతుంది.
ఇప్పుడు ఒకసారి ఆలోచిద్దాం, మన ఎదుగుదలకు ఏవేవి అడ్డుపడుతున్నాయో, మన జీవితంలో వేటిని వదిలి పెట్టాలి, వేటిని పట్టుకోవాలి, అనే కనీస అవగాహన అనేది మనకుంటే మన ఆత్మ ఎదుగుదల కచ్చితంగా జరుగుతుంది.
Note:
"ప్రేమ తత్త్వం" అనేది మనం దేనిని పట్టుకోవాలో నేర్పుతుంది.
"క్షమాగుణం" అనేది దేనిని వదిలి పెట్టాలో నేర్పుతుంది.
"సహనం" అనేది పై రెండింటి గురించి నేర్పుతుంది.
మనందరికీ తెలుసు ఆధ్యాత్మికత అంటే నీ గురించి నువ్వు శోధించు కోవడం అని. ఇలా శోధించు కొనే సమయంలో మన మైండ్ అనేది ఆత్మలో ఏకం అయిపోతుంది. ఇలా ఏకం కావడానికి ఎన్నో యోగ మార్గాలు ఉన్నాయి మనం ముందుగా తెలుసుకున్నాము, ఎంతోమంది మాస్టర్స్ ఎన్నో యోగ మార్గాలను అందించారు అని. అందరికీ కూడా ఒక సందేహం అనేది రావచ్చు! ఇన్ని మార్గాలలో నేను ఎందులో నడవాలి అని. అసలు వీటన్నింటి లో ఏది సరైనది అని. ఆలోచనలు కూడా వస్తాయి.
నా "గురువు" దగ్గర నుండి నేను తెలుసుకున్న దానిని ఇప్పుడు మీకు వివరిస్తాను.
మన లోపల 72,000 నాడులు ఉంటాయి. ఒక్కొక్క నాడీ Open అయ్యినపుడు, ఆ నాడీకి సంబంధించిన Dark side, light side పాఠాలను రెండింటినీ నేర్చుకోవలసి ఉంటుంది. ఇలా రెండింటికి సంబంధించిన పాఠాలను నేర్చుకున్నప్పుడే నీ చైతన్యం అనేది విస్తరిస్తుంది. ఎన్నో యోగ మార్గాల ద్వారా ఈ నాడులను మనం Open చేసుకొని Dark,Light side పాఠాలను మనం నేర్చుకుంటాం. కానీ, అన్నీ యోగ మార్గాలు అన్నీ నాడులను Open చేయలేవు. చాలా తక్కువ యోగ మార్గాలే అన్ని నాడులను ఓపెన్ చేయగలవు. మిగతావి వాటి పరిధి కొలది ఎన్ని అయితే అవి Open చేయగలవో వాటినే Open చేస్తాయి. అందుకే ఏ యోగమార్గం అనేది ఎక్కువ కాదు, తక్కువ కూడా కాదు, ఎన్ని 'యోగ మార్గాలను' మనం నేర్చుకుంటే! మనలోని నాడులను అంత త్వరగా ఓపెన్ చేసుకోవచ్చు.
ఏ జన్మలో ఏ నాడులను Open చేసుకోవాలో నీ ఆత్మ నిర్ణయం తీసు కుంటుంది. ఆ జన్మలో వాటికి సంబంధించిన నాడులను ఓపెన్ చేయడానికి ఉపయోగపడే యోగ మార్గాన్ని మీకు అందిస్తుంది. కానీ దానిని నీవు గుర్తించలేకపోతున్నావు. ఇలా గుర్తించాలి, అంటే నీ "ఆత్మ"కి శరణు పొందాల్సి ఉంటుంది. ఇలా శరణు పొందితే, నీవు గుర్తించ గలవు. ఈ విధంగా యోగ మార్గాల ద్వారా నీ నాడులను Open చేసుకొని జ్ఞానాన్ని పొందుతావు. నువ్వు ఏ యోగ మార్గాలను ఎంచుకున్నా, నువ్వు చివరికి చేరుకునేది ఆత్మ స్థితి నే... ఈ స్థితిలో నువ్వు ఎల్లప్పుడూ ప్రేమ, క్షమాగుణం, సహనం, దయ, కరుణ, మొదలైన గుణాలతోనే ఉంటావు. ఎన్ని మార్గాలు ఎంచుకున్నా నీలో చివరకు ప్రేమ, క్షమాగుణం, సహనం, అనేవి వృద్ధి చెందాల్సిందే! అందుకే LFP Yoga అనేది నీ యొక్క అన్నీ నాడులను ఓపెన్ చేయగలుగుతుంది. అన్ని యోగ మార్గాలు కూడా నీకు ఎన్నో రోజుల కఠోర సాధన తర్వాత ఆనందాన్ని(Blissfull Stage) అనుభవించేలా చేస్తాయి. కానీLFP Yoga ని సాధన చేసిన వారు త్వరగా వారి కర్మలను ఆనందంగా అనుభవిస్తూ(Enlightment) జ్ఞానాన్ని పొందుతూ ఆత్మ స్థితిలో ఉంటారు.
Self Love:
ప్రేమ అంటే నిజాయితీగా అవసరం ఉన్న వ్యక్తికి అందించడం (what he needed or Giving Nature) నీవు ఇతరులకు ఎంత అందించినా సరే, వారి మనసు ఇంకా ఏదో కావాలని కోరుకుంటుంది. అందుకే నువ్వు ఎంత ఇచ్చినా సరే అది తక్కువే అవుతుంది. నువ్వు పరిపూర్ణంగా ఏదైనా ఇవ్వాలి అంటే! అది ఒక్క "ఆత్మజ్ఞానం "మాత్రమే... ఆత్మజ్ఞానం కాకుండా నువ్వు ఏది ఇచ్చినా సరే అది కొంతకాలం వరకే ఉంటుంది. కానీ, ఆత్మ ఎదుగుదలకు ఉపయోగపడే సరైన జ్ఞానం ఎన్నో జన్మలకు ఉపయోగపడుతుంది.
Love అంటే ఏది అవసరమో దానిని అందించడం అని మనం తెలుసుకున్నాము, ఇక్కడ Self love అంటే నీకు ఏది అవసరమో దానిని నీకు నువ్వు అందించుకోవడం.
ఇక్కడ నీ ఆత్మ ఎదుగుదలకు ఏదైతే ఉపయోగపడుతుందో దానిని పట్టుకుంటావు. అది యోగ మార్గంకావచ్చు, నీ గురువు కావచ్చు, నీ జీవిత లక్ష్యం కావచ్చు, ఇంకా ఎన్నో ఉండవచ్చు. వీటిలో నీ ఎదుగుదలకు ఉపయోగపడే వాటిని పట్టుకుంటే నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నట్లే.
ఇంకా సులువుగా చెప్పాలంటే... నీ ఆత్మని నువ్వు గుర్తించడానికి, ఆత్మ స్థితిని చేరుకోవడానికి ఏవైతే అడ్డు పడుతున్నాయో, వాటిని గుర్తించి. వాటికి మూలాలు ఎక్కడ ఉన్నాయో, తెలుసుకుని వాటిని సమూలంగా నిర్మూలించి నీయొక్క నిజ స్థితికి అంటే ఆత్మ స్థితికి చేరుకోవడమే "Self love".
ఆధ్యాత్మిక జీవితం అంటేనే నీ("ఆత్మ") గురించి తెలుసుకోవడం. ఇలా తెలుసుకునే సమయంలో మన మనస్సు అడ్డుపడుతుంది అది అందరికీ తెలిసిన విషయమే ఇలా మనసు అడ్డుపడటం అందరికీ నచ్చదు? దీనిని ఇబ్బందిగా భావిస్తారు.. కానీ అందరికీ తెలియని విషయం ఏమిటంటే ఇలా మనసుని దాటకుండా ఆత్మ లోకి వస్తే ఎలా ఉంటుందంటే ఒక చిన్న పిల్లాడిని రాజ్యాధికారిని చేసినట్లే ఉంటుంది. అది నిరుపయోగం. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని నిలబడే వాడే అర్హుడు అవుతాడు. ఇలానే నీ లోపల ఉన్న మైండ్(కర్మలను)ని దాటితేనే ఆత్మ స్థితిని పొందుతావు. అందుకే చాలా తక్కువ మంది ఆత్మని చేరుకుంటారు. Self love అనేది ఎవరికీ ఎక్కువగా ఉంటే వారే ఆత్మని చేరుకోగలరు.
"నీవు చిన్నపిల్లాడివి కానంతవరకు నీవు దేవుడి రాజ్యంలోనికి అనుమతించబడవు" అని ఒక మాస్టర్ చెబుతాడు. అది అక్షర సత్యం కానీ నేను తెలుసుకున్న దాని ప్రకారం నిన్ను నువ్వు ప్రేమించు కోనంత వరకు నీవు నీ ఆత్మ కి దూరం అవుతున్నట్లే నిన్ను నువ్వు ఎంత ప్రేమించు కోగలిగేతే నీ ఆత్మకు నీవు అంత దగ్గర అవుతున్నట్లే... --Sai baba
ఈ ప్రపంచాన్ని నీవు నీ యొక్క దృష్టి కోణం నుంచి చూస్తావు అలాగే నీ చుట్టూ ఉన్న వారు వారి యొక్క దృష్టి కోణం నుంచి చూస్తారు నీకు correct అనిపించింది! ఇతరులకు వారి దృష్టికోణం లో wrong అనిపించవచ్చు. దీని ప్రకారం చూస్తే అసలు wrong correct అనేవి లేవుగా ఇక్కడ సమస్య ఏమిటంటే మన 'దృష్టికోణం' అసలు ఈ దృష్టికోణాన్ని తీసేస్తే, సమస్య అనేదే ఉండదు కదా! దృష్టికోణాన్ని తొలగించాలి అంటే ముందుగా నీ దృష్టి కోణం ఎలా ఉందో తెలుసుకోవాలి, వేటితో నిండి ఉందో తెలుసుకోగలగాలి, వీటిని తొలగించాలంటే! ఏ మార్గం ఉపయోగ పడుతుందో తెలుసు కోవాలి, ఇలా తెలుసుకొని దానిపై వర్క్ చేయాలి, దీన్నే self love అంటారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే మీలోని తప్పు, ఒప్పులు మరియు బలం, బలహీనతలు తెలుసుకొని ఏవి మీ ఎదుగుదలకు అడ్డుఉన్నాయో వాటిని తొలగించడమే 'Self love'.ఇదే ఆధ్యాత్మికత ఎన్నో యుగాలు ఎందరో చేస్తున్నది ఇదే. మీ గురించి మీరు దృష్టి పెడితే! ప్రపంచం గురించి అర్థం చేసుకోగలుగుతారు. అందరిలోనూ తప్పు చూసే మనం, మనలో ఉన్న తప్పు ఎందుకు చూడలేము? ఎందుకంటే! నీ గురించి నీకు తెలియదు కనుక.
నాకు హాస్యాన్ని తెచ్చే సంగతి ఏమిటంటే తన గురించే తనకు తెలియదు, కానీ ఇతరుల తప్పులను ఎత్తి చూపుతారు. ఒక వ్యక్తిని తప్పుగా అర్థం చేసుకొని, అతడు ఎప్పుడూ తప్పులే చేస్తాడు, అనే భావన మనలో కలుగుతుంది. అసలు నిజం ఏమిటంటే! ఎదుటి వ్యక్తి ఏ పరిస్థితులలో అలా చేయవలసి వచ్చిందో అని ఆలోచించరు, ఎప్పుడూ కూడా నీ స్థానం నుంచే కాకుండా, ఎదుటి వ్యక్తి స్థానం లోకి కూడా వెళ్లి చూడగలిగితే, 'అద్వైతం' అనే పదం నీకు అర్థం అవుతుంది.
Note:- అద్వైతం అంటే అంతా ఒక్కటే (oneness) అని అర్థం.
Self love అనేది మనలో ఎంత ఎక్కువగా ఉంటే మన ఎదుగుదల కూడా అంత ఎక్కువగా ఉంటుంది. అది ఆధ్యాత్మికం అయినా భౌతిక మార్గము అయినా, నీ గురించి నీవు తెలుసుకోకుండా నీ లోపాలను సరి చేసుకో లేకపోతే, నీ చుట్టూ ఉన్న వారు నీ గురించి తెలుసుకొని నిన్ను వారికోసం వాడుకుంటారు. Self love అంటే నిన్ను నువ్వు ఎల్లప్పుడూ దృఢంగా తయారు చేసుకునే ప్రక్రియ.
Self forgive:-
'క్షమాగుణం' అంటే 'receiving nature' మనకు ఏ ఆత్మలతో కర్మలు ఉన్నాయో! ఆ ఆత్మల నుంచి ఆశీర్వాదం పొందడం. ఇలా మనతో కర్మలు ఉన్న ఆత్మల నుండే కాకుండా, మనతో కర్మలు లేని ఆత్మ నుంచి కూడా నీవు ఆశీర్వాదం పొందుతున్నావంటే నీలో 'Self forgive' ఉన్నట్లే. ఇక్కడ నువ్వు Blessings నీ, నీతో కర్మ ఉన్న ఆత్మ నుంచి పొందితే, నీకు నీతో కర్మ ఉన్న ఆత్మల నుండి విముక్తి అయ్యి నీవు నీతో గడుపగలుగుతావు. ఇది ప్రతి సాధకుడు చేసే పనే. కానీ, నీకు అవసరం లేకున్నా, నీతో కర్మలు లేని ఆత్మలకు కూడా జ్ఞానాన్ని అందించి నీవు ఆశీర్వాదం పొందావు అంటే! నీవు "విశ్వాత్మ" గా మారుతున్నట్లే, ఎందుకంటే విశ్వాత్మనే విశ్వకళ్యాణం కోసం తాపత్రయం పడుతుంది.
ఈ విధంగా Self forgive ని రెండు రకాలుగా చూడొచ్చు, నీవు ఆత్మ అని అనుకున్నంత వరకు, నీకర్మలను తొలగించుకుంటావు. కానీ, ఎప్పుడైతే నిన్ను నువ్వు విశ్వాత్మకంగా చూస్తావో విశ్వంలో ఉన్న ప్రతి ఆత్మ ఎదుగుదలకు ఏమి చేయాలో నీవు దానిని ఎంతో కరుణతో చేస్తావు.
మీరు మన చరిత్రని చూసినట్లయితే కొంతకాలం తనని తాను శుభ్రం చేసుకుంటాడు, ఏ సాధకుడు అయినా. తర్వాత కొంతకాలానికి బయటకు వెళ్ళి తాను నేర్చుకున్న జ్ఞానాన్ని ఇతరులకు అందిస్తాడు. ఉదా :- బుద్ధుడు, వీరబ్రహ్మేంద్రస్వామి, వివేకానందుడు మొదలగున వారు.
ఇలా తనకోసం forgive ని సాధన చేసేవాడు! సాధకుడు ఆ forgive knowledge ని ఇతరులకు అందించేవాడు 'గురువు'.
గురువు = soul (ఆత్మ)
మన ఆత్మనే మన గురువు. ఆత్మ ఎప్పుడు కూడా మనసుకు knowledge అందిస్తూ ఉంటుంది. ఎందుకంటే, ఆత్మే మనసును సృష్టించింది కాబట్టి. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసింది ఏమిటంటే? ఆ ఆత్మ స్థితికి నిజంగా చేరుకున్న వాడు కూడా గురువే! మన ఆత్మ మనకి గురువు అయినప్పుడు ఆ స్థితిలో ఉన్న వాడు కూడా గురువే కదా... ఆత్మ స్థితిలో ఉన్న వారు ఎల్లప్పుడూ mind లో ఉన్నవారికి knowledge అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఆ knowledge ఎప్పుడు తెలుసుకోగలం అంటే ఎప్పుడైతే! ఆత్మకు Surrender అవుతామో అప్పుడు మాత్రమే అందుతుంది.
Forgive అంటే 'Connecting your Self'.
అన్నీ బంధాల నుండి నీవు విముక్తి పొందుతావు, క్షమాగుణాన్ని సాధన చేయడం ద్వారా. అన్నింటి నుంచి విముక్తి పొందాక నీతో నువ్వు connect అవుతావు. అప్పుడు నువ్వు భూత, భవిష్యత్ కాలాల గురించి కాక వర్తమాన కాలంలో ఎక్కువ జీవిస్తావు. ప్రేమ, క్షమాగుణం ఎవరిలో నైతే ఎక్కువగా ఉంటాయో! వారు ఏ లోకాలలోనైనా(Dimensions) ఆనందంగా జీవించగలుగుతారు. ఈ రెండు ఎప్పుడైతే పెంపొందుతాయో! అప్పుడు నీలో Acceptance అనేది పెరిగి నీ 'Life purpose' మీద ఎక్కువగా దృష్టి సాగిస్తావు.
మనకు ఉన్న కర్మలను తెలుసుకోవడానికి 'ప్రేమ శక్తిని' ఉపయోగిస్తాం.
మన కర్మలను తొలగించుకోవడానికి 'క్షమాగుణాన్ని' ఉపయోగిస్తాము.
Love:- అంటే Giving nature & knowing yourself.
Forgive:- అంటే Receiving Nature & connecting yourself.
Patience:- అంటే being yourself.
అన్ని యోగ మార్గాలు నీ ఆత్మ కళ్యాణం కోసం పని చేస్తాయి! కానీ LFP Yoga అనేది విశ్వకళ్యాణం కోసం పని చేస్తుంది. అది ఎలాగంటే,
1. అందరికీ జ్ఞానాన్ని అందిస్తే నిన్ను నీవు తెలుసుకోగలవు అని చెప్పేదే "ప్రేమ" (Love)
2. నీతో నువ్వు అనుసంధానం కావాలంటే ఎన్నో ఆత్మలయొక్క
ఆశీర్వాదం కావాలి అని చెప్పేదే "క్షమాగుణం"(Forgive)
3. నువ్వు ఆత్మ స్థితిలో ఉంటూ, అందరి లోపల ఉన్న ఆత్మ ని చూస్తూ, ఇతరులలో ఉన్న ఆత్మ, నీ లోపల ఉన్న ఆత్మ ఒక్కటే! అని అనుభవపూర్వకంగా తెలుసుకొని ఆనందంగా జీవించడమే "సహనం" (Patience).
Note: ఆత్మ కళ్యాణం అంటే ఏమిటి?
స్త్రీ పురుషుల కలయికని మనం కళ్యాణం అంటాము. ఇక్కడ స్త్రీ అంటే నీ మనసు, పురుషుడు అంటే నీ ఆత్మ, నీ మనస్సు ఆత్మలో ఎప్పుడైతే ఐక్యం అవుతుందో... అదే "ఆత్మ కళ్యాణం".
ఈ భూమి మీద ఉన్న వారు అందరూ వారి ఆత్మతో ఐక్యం అయినప్పుడు జరిగేది "విశ్వకళ్యాణం".
Practice well, love yourself, love all, Forgive yourself, Forgive all.
No comments:
Post a Comment