Tuesday, April 1, 2025

ఆధ్యాత్మికత, సాధన పట్ల అపోహలు!*

 *ఆధ్యాత్మికత, సాధన పట్ల అపోహలు!*


1. *ఆధ్యాత్మికత అనేది"కేవలం" భౌతిక అవసరాలను తీర్చుకోవడానికేనా?*


ఆధ్యాత్మికత అనేది"కేవలం" భౌతిక అవసరాలను తీర్చుకోవడానికి కాదు.


 2. *ఆధ్యాత్మికత అనేది శక్తికి సంబంధించినదా లేక జ్ఞానానికి సంబంధించినదా?*


ఆధ్యాత్మికత అనేది శక్తి మరియు జ్ఞాన ఆధారితమైనది - కేవలం శక్తిని గ్రహించడమే కాదు, జ్ఞానాన్ని తీసుకొని చైతన్యాన్ని విస్తరించుకోవాలి.


3. *ఆధ్యాత్మికతలో దీక్షకు చాలా ప్రాముఖ్యం ఉందా?*


ఆధ్యాత్మికతలో దీక్షకు చాలా ప్రాముఖ్యం ఉంది. దీక్ష రూపంలో కాకుండా మామూలుగా సాధన చేయడం ద్వారా కొంతవరకు శక్తిని పొంది, కొంతమేరకు మనశ్శాంతిని పొందుతారు. కానీ గురు సమక్షంలో సరి అయిన ఆధ్యాత్మిక దీక్ష తీసుకోవడం ద్వారా ఆత్మజ్ఞానం, ఆత్మ శాంతిని పొంది ఆత్మ పరిణామ క్రమంలో ముందుకు వెళతాము.


4. *ఆధ్యాత్మికత సాధన అనేది శిష్యుడు చేయాలా? లేదా గురువు చేయించాలా?*


గురువు దగ్గర దీక్ష తీసుకుని శిష్యుడు తాను స్వయంగా సాధన చేయాలి. సాధన ద్వారా స్వీయ అనుభవాలను పొంది, సాధనలో వచ్చే సందేహలను గురువు నివృత్తి చేస్తాడు.


5. *ఆధ్యాత్మక విద్యని భోదించినపుడు డబ్బును తీసుకోవచ్చా?*


డబ్బును తీసుకోవచ్చు. ఎందుకంటే డబ్బు అంటే శక్తి. శిష్యుడి యొక్క అజ్ఞానం తాలూకు కర్మలను డబ్బు రూపంలో తీసుకొని గురువు దీక్ష రూపులో జ్ఞానాన్ని,శక్తిని అందిస్తారు.


దీనినే మనo *Energy Exchange* అంటాము. ఎందుకంటే ఈ విశ్వంలో తీసుకోవడం మరియు  ఇవ్వడం అనేది నిరంతరం జరిగే పక్రియ. దీనినే శక్తి-ప్రసారం అంటారు. ఇలా ఆధ్యాత్మికతలో డబ్బుని తీసుకోకూడదు ఆనే సంకోచిత భావాల వలన మనకు డబ్బు పట్లు సరి అయిన అవగాహన లేకపోవడం వలన మనం మన జీవితంలోనికి డబ్బుని ఆకర్షించలేకపోతున్నాము.


6. *శక్తికి సంభందించిన గురువులు, ఆత్మజ్ఞానానికి సంబందించిన గురువులను గుర్తించడం ఎలా?*


శక్తికి సంబందించిన గురువులు బాహ్యంగా మార్పులు వచ్చే సాధనా విధానాలను సూచిస్తారు. ఆ మార్పులు కూడా సంపూర్ణంగా రావు, అవి తాత్కాలికమే.

 ఆధ్యాత్మిక గురువులు అంతరంలో మరియు బాహ్యంగా జ్ఞానం ద్వారా మార్పులు తీసుకువచ్చే సాధనా విధానాలను సూచిస్తారు. అవి శాశ్వతమైన మార్పులు.



7. *ఆధ్యాత్మికత సాధన అనేది వయస్సు మీదపడ్డాక చేసేదా లేక సమస్య వచ్చినపుడు చేసేదా?*



 ఆధ్యాత్మిక సాధన అనేది వయస్సు అయిపోయాకనో లేక ఏదయినా సమస్య వచ్చినపుడు మాత్రమే చేసేది అనుకుంటారు. కానీ, ఆధ్యాత్మిక సాధన అనేది ఏ వయసు వారికి అయినా (బాల్యం నుండి) అనుకూలమయినదే. ఆధ్యాత్మిక సాధన అనేది నిన్ను నీవు సంపూర్ణంగా, పరిపూర్ణంగా తెలుసుకోవడానికి ఇవ్వబడిన ఒక గొప్ప సాధన.


 8. *ఆధ్యాత్మికత అంటే సన్యసించడం అనుకుంటున్నారు. అసలు సన్యసించడం అంటే ఏమిటి?*


 సన్యసించడం అంటే మానసిక సన్యాసం, అంటే ఒక వ్యక్తి పట్ల కాని, వస్తువు పట్ల కాని, మరే ఇతర వాటి పట్ల గానీ భావోద్వేగాలను త్యజించడం. ఇదే అసలయిన సన్యసించడం అంటే.


9. *గొప్ప గురువులు, గొప్ప సంస్థలు ఉంటాయా?*


గొప్ప గురువులు, సంస్థలు ఉండవు. అందరూ సత్యాన్ని తెలుసుకునే మార్గాన్ని సూచిస్తారు. వారినే గురువులు, సద్గురువులు మరియు పరమగురువులు అంటారు. వారందరు వారి, వారి స్థితిని బట్టి సాధనా మార్గాన్ని సూచిస్తారు. సంస్థలు అన్నీ సత్యాన్ని అందించే కేంద్రాలు మాత్రమే(ఇక్కడ గురువు అందించిన జ్ఞానాన్ని విడిచిపెట్టి, మా సంస్థ గొప్ప లేదా మా గురువు గొప్ప అనే అహంకారంలో ఇరకడం వలన వారి ఎదుగుదల అక్కడే ఆగిపోతుంది).


10. *ఆధ్యాత్మికత, ఆధ్యాత్మిక సాధన ఎందుకు?*


మనం కళాత్మకంగా, శాంతితో, సరియైన జ్ఞానంతో, శక్తితో, సత్యం తో, ఆనందం తో జీవించడానికి అవసరం. అలాగే నీ యధార్థ స్థితి గురించి తెలుసుకోవడానికి ఆధ్యాత్మిక సాధన అవసరం.


11. *ఆధ్యాత్మక సాధనలో, ఆధ్యాత్మిక ప్రచారంలో కష్టాలను ఎదుర్కుంటామా?*


సరిమైన భావనతో కాకుండా, అంటే నేను చేస్తున్నాను, చెప్తున్నాను. అనే ఆలోచనలతో, భావనలతో ఉండి మరియు ఫలితాన్ని ఆశించి చేసినపుడు దుష్పలితాలు వస్తాయి. ఆధ్యాత్మిక సాధన చేసినా,చేయకపోయినా నీ జీవితంలో కొన్ని సవాళ్ళు వస్తాయి. అయితే సాధన ద్వారా నీవు అధికశక్తిని, జ్ఞానాన్ని గ్రహించి తద్వారా నీ ఆత్మశక్తి వెలికితీయబడి, జ్ఞానం ద్వారా నీవు ఆ సవాలుని ఎదుర్కుంటావు. ఒకవేళ నీవు ఆధ్యాత్మాక సాధన చేయకపోవడం ద్వారా నీ జీవితంలో  సవాళ్ళని ఎదుర్కోలేనంత మానసిక శక్తి లేకపోవడం వల్ల ఉన్న శక్తి నిర్వీర్యం అయి భయం, ఆందోళన, ఒత్తిడికి గురి అయి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.


12. *ఆధ్యాత్మకత ద్వారా అనారోగ్య సమస్యలకు తొలగించుకోవచ్చా?*


అన్ని ఆరోగ్య సమస్యలకు కారణం సరికానీ ఆలోచనలు, ధృక్పదాలు, నమ్మకాలు, దృష్టికోణాలు. వీటి వల్ల శక్తి హీనులమై అన్ని ఆనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నాము. మనలో ఆత్మశక్తిని, ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకోవడం వల్ల పైవన్ని సరిచేసుకొని ఆరోగ్యంగా, ఆనందంగా జీవించడం సాధ్యమవుతుంది. మానసికంగా ఆరోగ్యకరమైన స్థితి లేకపోవడం వల్లే అన్నీ అనారోగ్య సమస్యలకు కారణం.


13. *ఆధ్యాత్మిక సాధన లో ఉన్నప్పటికీ కొన్ని సమస్యలు పదేపదే ఎందుకు వస్తున్నాయి?*


సమస్య ఏదైతే జ్ఞానాన్ని నేర్పించాలి (అందించాలి) అనుకుంటుందో, అది అంగీకరించకపోవడం వల్ల సమస్య పునరావృతి అవుతుంది. అంగీకరించకుండా అడ్డుపడేవి నీ అహంకారం ఇంకా నీ మనస్సు, అజ్ఞానం.


14. *గురువు అంటే భౌతిక కోరికలు తీర్చేవాడా?*


భౌతిక కోరికలు తీర్చవాడు కాదు గురువు. కానీ, దేనిని పట్టుకుంటే భౌతికంగా, ఆధ్యాత్మికంగా ఎదుగుతావో దానిని అందించేవాడు గురువు.


15.ఆధ్యాత్మికత ఉద్యోగమా?వ్యాపారమా?

ఆధ్యాత్మికత అనేది నీ PURPOSE తెలుసుకోవడానికి. ఆధ్యాత్మికత అనేది నీ సెల్ఫ్ MISSION పూర్తి చేయడానికి.


16.ఆధ్యాత్మికత అనేది మతమా? సంఘంమా (cult) ఆ?సంప్రదాయమా (group)ఆ?

ఆధ్యాత్మికత అనేది మతం కాదు,సంఘం(group)కాదు,సంప్రదాయం(cult) కాదు.ఆధ్యాత్మికత అనేది నీ యథార్థ స్థితిని తెలుసుకోవడానికి  మరియు నీ స్వ అనుభవం పొందడం.  ( self knowing process.)


Soul Mission World

No comments:

Post a Comment

Transformation Through LFP Kriya Yoga: Quantum, Neuro, and Chakra Dimensions

Transformation Through LFP Kriya Yoga: Quantum, Neuro, and Chakra Dimensions LFP Kriya Yoga, founded by Suresh Neelam, is not merely a medit...