ఎల్ఎఫ్పి క్రియ యోగ సాధనలో సమస్యలు ఎందుకు బయటకు వస్తాయి?
ఎల్ఎఫ్‌పి క్రియ యోగా ప్రారంభించినప్పుడు, మనలో దాచుకున్న పాత గాయాలు, కర్మ బంధాలు, నయం కాని స్మృతులు అన్నీ ఉపరితలానికి (చేతన మనసు ) వస్తాయి. ఇవి 'సమస్యలు'లా అనిపించవచ్చు, కానీ నిజానికి ఇవి ఆత్మ శుద్ధి ప్రక్రియ.
ఎలా శరీరాన్ని డీటాక్స్ (శుద్దీ) చేస్తే లోపల దాచుకున్న విషతత్త్వాలు బయటకు వస్తాయో, అలాగే ఆధ్యాత్మిక శుద్ధిలో అనుభవించని, నయం కాని భాగాలు బయటపడతాయి. ఇవి శిక్షలు కావు, ఇవి ఆత్మ జ్ఞానం కోసం వచ్చిన అవకాశాలు.
వీటిని అనుభవించి, జ్ఞానంగా మార్చుకోకపోతే ఆత్మ అశాంతిగా ఉంటుంది, శాంతిని పొందలేదు . ఎల్ఎఫ్‌పి క్రియ యోగా మనకు వాటిని ఎదుర్కొని, పరిష్కరించి, జ్ఞానముగా మార్చుకునే శక్తిని ఇస్తుంది.
సాధకులు చేసే సాధారణ తప్పు
ఈ సమయంలో కొందరు సాధకులు సహనం కోల్పోతారు. ఆశ విడిచి సాధన ఆపేస్తారు. ఆ తరువాత తాత్కాలిక పరిష్కారాల కోసం ఇతర గురువులు, పూజలు లేదా తాత్కాలిక ఉపాయాలు వెతుకుతారు. ఇవి పైకి ఉపశమనం ఇవ్వగలవు కానీ మూల సమస్యను తొలగించవు.
అలా ఆపేయడం అనేది విముక్తి ద్వారాన్ని మూసివేయటమే. శస్త్రచికిత్సలో నొప్పి భయంతో మధ్యలో ఆపేసినట్లే ఇది కూడా.
సరైన మార్గం
సరైన మార్గం ప్రక్రియపై విశ్వాసం ఉంచడం. ఆత్మప్రేమ, క్షమ, సహనం తో సాధన కొనసాగిస్తే ప్రతి సమస్య జ్ఞానంగా మారుతుంది. ప్రతి సవాలు విముక్తి వైపు నడిపించే దారిగా మారుతుంది.
ఎల్ఎఫ్‌పి క్రియ యోగా తాత్కాలిక పరిష్కారం కాదు — ఇది ఆత్మకు శాశ్వత ఔషధం.
“సమస్యలు నిన్ను బాధించడానికి రావు; అవి నీ ఆత్మలో నయం కాని భాగాలను చూపటానికి వస్తాయి.
సమస్యలు బయటకు వస్తున్నప్పుడు – అది డీటాక్సిఫికేషన్(శుద్దీ)
ఎల్ఎఫ్ పి క్రియ యోగా సాధనలో కొన్నిసార్లు మనకు సమస్యలు ఎక్కువైపోయినట్టు అనిపిస్తుంది. కానీ నిజానికి ఇది డీటాక్సిఫికేషన్(శుద్దీ) ప్రక్రియ.
శరీరం, మనసు, ఆత్మ, ఆరా , చక్రాలు అన్నింటి నుండి పాత కర్మబంధాలు, గాయాలు, నెగటివ్ ఎనర్జీలు బయటికి వస్తున్నాయి. ఇవి బయటపడకపోతే లోపలే పేరుకుపోయి బాధలు కష్టాలు ఉద్యోగసమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబసమస్యలు, గ్రహ,వాస్తు,పితృ ,కాలసర్ప దోషాలుగా మారుతాయి
మనసు మాత్రం ఈ ప్రక్రియను తప్పుగా అర్థం చేసుకుంటుంది. “ఈ సాధన వల్లే సమస్యలు వస్తున్నాయి, లేదంటే అన్నీ బాగానే ఉన్నాయి” అని నమ్మిస్తుంది. ఇది నిజం కాదు – ఇది మైండ్ వేసే ఉచ్చులోని భ్రమ.
అసలు వాస్తవం ఏమిటంటే – సమస్యలు కొత్తగా రాకుండా, పాతవి బయటపడుతున్నాయి. ఇది ఒక శుద్ధి ప్రక్రియ. ఔషధం తాగినప్పుడు శరీరంలో జ్వరం వచ్చినట్టే, ఇది కూడా హీలింగ్ వైపు తీసుకెళ్లే దశ.
✨ సారాంశ వాక్యం
“సమస్యలు రావడం కాదు, సమస్యలు బయటపడుతున్నాయి. అది డీటాక్సిఫికేషన్ – శరీరం, మనసు, ఆత్మ హీలింగ్ కోసం జరుగుతున్న శుద్ధి.” –
జ్ఞానముగా మార్చుతుంది.” – సురేష్ నీలం
ప్రతి ఆధ్యాత్మిక సాధనలో జరిగే సత్యానుభవం
ఎల్ఎఫ్పి క్రియ యోగా మాత్రమే కాదు – ఏ ఆధ్యాత్మిక సాధనలోనైనా ఇదే జరుగుతుంది.
మనలో దాచుకున్న కర్మ, గాయాలు, అపూర్ణ అనుభవాలు బయటకు వస్తాయి. ఇవి మనసుకు సమస్యల్లా అనిపిస్తాయి కానీ వాస్తవంలో ఇవి సత్యానుభవం కోసం జరుగుతున్న పరిణామాలు.
సాధన అనేది కేవలం శాంతి ఇవ్వడానికి కాదు – అది మనల్ని సత్యం స్వరూపం వైపు నడిపించడానికి.
సత్యం తెలుసుకోవాలంటే, ముందుగా అబద్ధం, మాయ, భ్రమలన్నీ కరిగిపోవాలి.
అదే సమయంలో దాచుకున్న నొప్పి, భయం, అహంకారం బయటపడతాయి.
ఈ అనుభవాలు లేకుండా సత్యం ప్రత్యక్షం కాదని గుర్తించాలి.
ఎల్ఎఫ్పి క్రియ యోగా ఈ ప్రక్రియను sacred geometry ద్వారా సులభతరం చేస్తుంది.
✨ సారాంశ వాక్యం
“ఏ ఆధ్యాత్మిక సాధన చేసినా, దాచుకున్నది బయటకు రావడం తప్పనిసరి. అది సమస్య కాదు – సత్యం వైపు పయనం.” – సురేష్ నీలం
గురువుకి లేదా ఆత్మకు శరణాగతి
సాధనలో సమస్యలు ఎదురైనప్పుడు అత్యంత శక్తివంతమైన మార్గం శరణాగతి. గురువుకి శరణాగతి లేదా నీ స్వీయ ఆత్మకు శరణాగతి ఇచ్చినపుడు అన్ని భారాలు తేలికవుతాయి. శరణాగతి అనేది సమస్యల నుండి పారిపోవడం కాదు, ఆ సమస్యలను ఉన్నత జ్ఞానానికి అప్పగించడం.
ఎల్ఎఫ్‌పి క్రియ యోగా లో శరణాగతి సాధకుని హృదయాన్ని విప్పుతుంది. ఇది ఆత్మలో దాచుకున్న భయాలను, కర్మ బంధాలను కరిగిస్తుంది. గురువుకు లేదా ఆత్మకు శరణాగతి ఇచ్చినపుడు సాధన మరింత సులభమవుతుంది.
సురేష్ నీలం