Thursday, October 31, 2024

నీలోనే ..దేవుడు

 నీలోనే ..దేవుడు"


దేవుడే చెబుతున్నాడు

నీలో నీవే అన్వేషించు...

నిజమైన దేవుడు దొరుకుతాడని...


రేపటి ఉదయం నీవే..

నేటి హృదయం నీవే..

ఏ దేవుడికీ మొర పెట్టుకోకు!

నీ మొర ఆలకించే వారు లేరు...


నేరం ఒకరిదైతే శిక్ష 

మరొకరికి కాకూడదు...

నిలదీసి నీకు నీవే ప్రశ్నించుకో!

నిలువెత్తు జవాబుదారివి నీవే!

దీపాలు వెలిగించాల్సింది ఎక్కడో కాదు

నీకు నీలోనే వెలిగించుకోవాలి!..


నీ కళ్ళలోయలోకి చూసుకో!

నిజనిజాలు నీకే తెలుస్తోంది...

నీవు ఈదిన దుఃఖపు నదిని నీలో తడుముకో!

ఆ స్పర్శ గుర్తొస్తోంది!...


ఎన్ని అగాధాలను దాటేశావో

పోగొట్టుకొన్నదేదో గమనించు...

నీ నాడిని ఒక్కసారి పరీక్షించుకో!

ఎన్ని ఆలోచనలతో మనసు ముడిపడిందో 

నీకు నీవే పరిశీలించుకో

గుండెచప్పుళ్ల ధ్వనులను...


మొదట నీలో నీవు వెతుక్కోవాలి

దొరక్కపోతే ఈ భూమి మీద వెతకాలి..

దేవుడు చెప్పాడు... 

సమస్తం నీలోనే ఉందని!..

కనిపించేవన్నీ బౌతిక రూపాలు...

అశాశ్వత దృశ్యాలు... 

నీలోఉన్నదే శాశ్వతం!...


ప్రత్యక్షంగా దర్శించుకోవాలి...

ఈ సమస్తం ఓ సుదీర్ఘస్వప్నం!..

భ్రాంతిలో నడుస్తుంటే

నీలోని క్రాంతి కదలిపోతుంది...

ప్రశాంతి జరిగిపోతోంది...

మనశాంతి కరువవుతోంది...


నీలో ఎన్నెన్ని రూపాలు ఉన్నవో!...

ఒకొక్కరూపానికి ఒకొక్క నమ్మకం!

ఈ నమ్మకాలకు స్వస్తిచెప్పి

నమ్మదగింది ఏదో నీవే వెతుక్కో!!

తలవంచి నీలోకి చూడు...

తళుక్కున మెరిసే తలంపు గుర్తొస్తుంది.

ఈ భౌతిక రూపాలలో అన్నీ జడత్వాలే!

అన్నీ నీలోనే...అన్నీ నీవే!...

No comments:

Post a Comment

Understanding How God Gives Through Energy, Not Objects*

 **🌟 The Divine Law of Receiving Understanding How God Gives Through Energy, Not Objects** Human beings often pray with expectation but rec...