Thursday, May 27, 2021

Master message about SMW

 *సోల్ మిషన్ వరల్డ్*

 ద్వార ఈ మానవాళికి పరమగురువులు (మహాఅవతార్ బాబాజీ,సాయిబాబా,శ్రీ కృష్ణుడు,మహా శివుడు,అమ్మ వారు) రెండు అద్భుతమైన సెల్ఫ్ హీలింగ్ టెక్నిక్స్.

1.సోల్ హీలింగ్.

2.శివశక్తి హీలింగ్ అందించారు.


ప్రస్తుత పరిస్థితుల్లో చాలా వరకు ఆరోగ్య ,ఆర్ధిక ,ఉద్యోగ మరియు కుటుంబ పరమయిన సమస్యలు మనిషిని మానసికంగా ఎంతో వేదిస్థున్నాయి.ఒకప్పుడు కాలానుగుణoగా రోగాలు వచ్చేవి కానీ ఇపుడు రుగ్మతలు ఎక్కువగా వస్తున్నాయి.ఈ రుగ్మతలు మనలోనే పుడుతూన్నయి ఒకపుడు ఇంట్లో ఒక్కరికి మాత్రమే అనారోగ్య సమస్య ఉండేది కానీ ఇపుడు ఇంట్లో ప్రతీ ఒక్కరికీ 4 లేదా 5 అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.ఈ రుగ్మతలు అనేవి అంతరంగ ప్రపంచంలో విపరీతమయినటువంటి భావోద్వేగాల వల్ల మరియు సరికాని ఆలోచనలు,భావనలు,నమ్మకవ్యస్థ వల్ల వస్తాయి.


నాణ్యమైన పోషకవిలువలు మరియు పంచభూతాల సమతుల్య లోపం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి.ప్రతీ మనిషి స్వార్ధం అనే లోభం లో పడి ప్రేమ,కరుణ,దయ లోపించడం వల్ల వ్యాపార దృక్పథం తో నైతిక విలువలను మరచి తనలోని పంచభూతాలను మరియు ప్రకృతిలోని పంచభూతాలను సమతుల్యంగా ఉండనివ్వడం లేదు.


అఙ్ఞానంతో అహంకారంతో  ధర్మాన్ని మరచి విశ్వ చట్టాలను,ప్రకృతి నియమాలను ఉల్లంఘించి తోటి జీవుల పట్ల ప్రేమ,కరుణ,దయ కలిగి ఉండకపోవడం మరియు వాటిని హించించడం,భుజించడం ద్వారా మనం మన ఆత్మకు దూరమయి మనలోని విశ్వశక్తి,దైవశక్తి,ఆత్మశక్తి తగ్గి మనం మానసికంగా చాలా బలహీనమయాము.మనలోని విపరీతమయిన  భయం క్రోదం అశాంతి ఈర్ష్య పెరిగి మనలోని ప్రతీ చిన్న సమస్యకు బయట పరిష్కారాన్ని వెదుకుతున్నము.


కావున మన అంతరంగ ప్రపంచంలో ఉన్న సరికాని ఆలోచనలు,సరికాని భావనలు,సరికాని నమ్మకవ్యవస్థ మరియు జీవితంలో ఉన్న ప్రతీ సమస్యకు గల మూలాలు కారణాలు మన లోపల(అంతరంగం) ఏవయితే ఉన్నాయో వాటిని తొలగించుకొవడానికి  యెల్.ఎఫ్.పి  యోగా (LFP YOGA) అనేది అద్భుతంగా దోహదపడుతుంది.యెల్.ఎఫ్.పి అంటే విశ్వశక్తి ,దైవశక్తి,ఆత్మశక్తి. విశ్వశక్తి అంటే విశ్వాత్మ నుండి సహజంగా తీసుకుంటాము.దైవశక్తి అనేది అంత సులభంగా వచ్చేది కాదు ఇది ఇతర ఆత్మల నుండి మరియు సామూహిక ఆత్మల నుండి వస్తుంది ఇది క్షమాగుణం పెంపొందించుకొని సాధన చేయడం ద్వారా లభిస్తుంది.విశ్వాత్మ  నుండి విశ్వశక్తి  ఇతర ఆత్మల నుండి వచ్చే దైవశక్తి  ద్వారా మనలో ఆత్మశక్తి  పెరుగుతుంది.ప్రస్తుత పరిస్థితుల్లో అన్నిటికన్న మనకు అత్యంత ముఖ్యమయినది ఆత్మశక్తి.ఈ ఆత్మ శక్తి మనలో అధికంగా ఉంటే ప్రతీది ఎదుర్కోవడానికి మనలను సిధ్ధం చేస్తుంది.

No comments:

Post a Comment

Understanding How God Gives Through Energy, Not Objects*

 **🌟 The Divine Law of Receiving Understanding How God Gives Through Energy, Not Objects** Human beings often pray with expectation but rec...