Tuesday, March 8, 2022

మరణ సమయంలో

 ప్రాణ ప్రయాణ సమయం : మృత్యు ముఖం

మరణించబోతున్న వ్యక్తి అత్యంత ప్రశాంత స్థితి కి చేరు కుంటాడు.మరణానికి చేరువ కాబోతున్న వ్యక్తికి సర్వ విధ వ్యాపారాలు స్తంభించి పోతాయి.అతి కొద్ది మందికి తప్ప అతడికి తను మృత్యువు కి చేరువ కాబోతున్న విషయం తెలియదు...రక్త ప్రసారం స్తంభించు పోతుంది..... ఆక్సిజెన్ సరఫరా ఆగి పోతుంది.......మెదడు స్తంభించి పోతుంది. అప్పటి దాకా అత్యంత వ్ర్దన అనుభవించినా అతడు ఆ సమయం లో అత్యంత ప్రశాంత స్థితి కి చేరుకుంటాడు...

మరణించ బోయే ముందు అతడి ఆలోచనలు కోరికలు సంకల్పాలు అతడి. మరణానంతర జీవితాన్ని, వచ్చే జన్మ ని కూడా ప్రభావితం చేస్తాయి.

క్రమం గా అతడి భౌతిక శరీరం లోని ప్రాణచైతన్యం ఉపసంహరించబడుతుంది. ఆ ప్రాణం గులాబీ వర్ణం తో మెరుస్తూ హృదయం మధ్యకి చేరుకుంటుంది. అతడు కోమా లోకి చేరుకుంటాడు. అతడి దేహం చుట్టూ వయొలెట్ వర్ణం లో ప్రకాశిస్తు అతడి సూక్ష్మ శరీరం తెలియాడుతూ ఉంటుంది.

ఆ సమయం ఒక అద్భుతం చోటు చేసుకుంటుంది.అతడు తాను జన్మించినప్పటి నుండీ మరణం వరకు జరిగినదంతా ఒక సినిమా లా, సవివరం గా అతడి ముందు ప్రత్యక్ష మవుతుంది.

బాల్యం, పాఠశాల, కళాశాల, ప్రేమా... పెళ్లి.. ఉద్యోగం ..శతృత్వాలు.. ధనం .. అప్పులు.. దుఖాలు ముసలితనం అంతా ప్రత్యక్షం అవుతుంది తనకు ఒక అవకాశం గా ఇవ్వ బడిన జీవితాన్ని తాను ఏమి చేసుకున్నాడో చూసుకునే అవకాశం అతడికి లభిస్తుంది.

అందుకే మరణించబోయే వ్యక్తి ఉన్న ప్రదేశం లో ఎటువంటి చప్పుళ్ళు అరుపులు ఉండకూడదు ప్రశాంతం గా ఉండాలి అంటారు. అతడు తన జీవితాని పునర్విమర్శ చేసుకునే సమయం లో ఎటువంటి గందరగోళం ఉండ కూడదు. . .

మరణించిన .. ..వ్యక్తి చుట్టూ రోదనలు. దుఃఖాలు ఉండకూడదు

అతడికి ఇది తీవ్ర మైన దుఃఖం కలిగిస్తుంది. మన కన్నీళ్లు

వారి ప్రస్తాన వేగాన్ని ఆలస్యం చేస్తుంది. పెద్దల మరణాన్ని అందుకే పెళ్లిలా జరుపుకోమన్నారు...వారి స్మృతులని. ఆనందం గా అందరు పంచుకోవాలి.. ఇప్పుడే వారి అనంతర ప్రస్తానం ముందుకు సాగుతుంది..

డా. పి.ఎల్.ఎన్.ప్రసాద్గారు

25 Deep Astral Tests in the Astral Realms

 25 Deep Astral Tests in the Astral Realms These astral tests are not merely symbolic—they are energetic initiations encountered by the soul...