Thursday, March 20, 2025

గురువు కానివాడే, నిజమైన సద్గురువు

 


ఎప్పుడైనా ఒక వ్యక్తి మీకు సంబంధించినంత వరకు మాత్రమే "గురువు"గా కాగలడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి “మీడియం”లాగా వుంటాడో అతను జగదాత్మకు సంబంధించినవాడు అవుతాడు. అప్పుడు అతనికి మీతో ఎలాంటి సంబంధం వుండదు. ఈ తేడా మీకు అర్థమైందా?


మీతో సంబంధించినప్పుడు వున్న ఏ పరిస్థితులలోనూ అహంకారం ఉండకూడదు. కనుక ఎవరైతే గురువుగా కాలేరో వారే నిజమైన గురువు. ఎవరైతే గురువుగా కారో వారే పరిపూర్ణమైన గురువు. అదే ఒక సద్గురువు యొక్క నిర్వచనం. ఎవరైతే వారిని వారు గురువు అని అనుకుంటారో వారికి ఒక గురువుగా వుండే అర్హత లేదని దీని అర్థం. గురువు అనే పదవిని హక్కుగా వాదించడం కంటే పెద్ద అనర్హత ఇంకేమీ లేదు. ఇది అలాంటి వ్యక్తిలో అహంకారం వుంది అని తెలుపుతుంది. అది అపాయకరం కూడా.


ఒకవేళ ఒక వ్యక్తి హఠాత్తుగా ఒక శూన్యతాస్థితిని, ఎక్కడైతే అహంకారం పూర్తిగా మాయమైపోతుందో అలాంటి స్థితిని చేరతాడో, అలాంటి వ్యక్తి మీడియంగా కాగలడు. అప్పుడు అతని సన్నిధిలో శక్తిపాతం జరుగుతుంది. అప్పుడు అక్కడ ఎలాంటి అపాయమూ జరిగే అవకాశం వుండదు. మీకు గానీ లేక ఎవరి ద్వారా శక్తి ప్రవహిస్తుందో ఆ “మీడియం”కి గానీ ఎలాంటి అపాయమూ ఉండదు.



Soul Mission World

25 Deep Astral Tests in the Astral Realms

 25 Deep Astral Tests in the Astral Realms These astral tests are not merely symbolic—they are energetic initiations encountered by the soul...