Sunday, April 28, 2024

గురువెంత గొప్పవాడో తెలుసా

 గురువెంత గొప్పవాడో తెలుసా   


         *బ్రహ్మ స్థానే కృతం పాపం*


            *విష్ణు స్థానే విన శృతి*


         *విష్ణు  స్థానే కృతం పాపం*


              *శివ స్థానే విన శృతి*


           *శివ  స్థానే కృతం పాపం*


            *గురు స్థానే  విన శృతి*


          *గురుస్థానే కృతం పాపం*


             *నాస్తి స్థానే విన శృతి*


               *బ్రహ్మ వద్ద చేసిన తప్పులు విష్ణువు వద్ద చెప్పిదిద్దు కొనవచ్చు*


            *విష్ణువు వద్ద చేసుకున్న తప్పులు శివుని వద్దచెప్పి దిద్దు కొనవచ్చు*


             *శివుని వద్ద చేసిన తప్పులు గురువు వద్ద చెప్పిదిద్దు కొనవచ్చు*


              *గురువు వద్ద చేసిన తప్పులు వేరే ఎవరి వద్ద చెప్పిదిద్దు కొనలేము*


               *అంతటి గొప్ప వ్యక్తి గురువు అని మన వేదాలలో చెప్పబడింది కనుక గురువును గౌరవిద్దాం*🙏🏻


               *గురువు గారు చెప్పిన  మాటను పాటిద్దాం*👍🏻

Friday, April 19, 2024

Who is Guru?

 గురువు


డబ్బు,  పేరు, పదవులు ఇవన్నీ అర్థాలు మాత్రమే..

 

పరమార్థాన్ని తెలుసుకోవడానికి, జీవన గమ్యంని చేర్చగలిగేవాడు *'గురువు'* మాత్రమే అని చెప్పే కధ ఇది. 


ఓసారి చదవండి....


ఓ మహానగరంలో  ఓ గురువుగారు తన వద్దకు వచ్చేవారికి ఆధ్మాత్మిక శిక్షణ ఇస్తూ, ధర్మప్రబోధం చేస్తుండేవారు.


మహాసంపన్నుడొకడు ఈ గురువుగారి దగ్గరకు వచ్చి


అసలు గురువు అవసరమా?


గురువు లేకుంటే వచ్చిన నష్టమేమిటి?


అని ప్రశ్నించాడు. 


గురువుగారు నవ్వుకుని, మీరేం చేస్తుంటారని అడిగారు.


నాకు అతిపెద్ద సూపర్ బజార్ ఉంది అని సమాధానమిచ్చాడు సంపన్నుడు.


అయితే! ఒకసారి మీ సూపర్ బజార్ కు నన్ను తీసుకువెళ్లండని గురువుగారు అడిగారు. 


ఇద్దరూ కలిసి సూపర్ బజార్ కు వెళ్లారు. ఆ రోజు సెలవు కావడంతో నిర్మానుష్యంగా ఉంది. 


ఏడంతస్థుల పెద్ద భవంతి. అందులో దొరకనిదంటూ ఉండదు. దానిని చూసిన గురువుగారు నవ్వుకున్నారు.


అక్కడే ఈ సంపన్నుడు ఆవులను, కుక్కలను పెంచుతున్నాడు. 


ఆ మందలోంచి ఒక ఆవును సూపర్ బజార్ లోపలికి వదలవలసిందిగా గురువుగారు కోరారు.


కోరినట్లుగానే ఆవును లోపలికి ప్రవేశపెట్టారు. అది అన్నీ తిరుగుతూ, తిరుగుతూ చివరకు ఒక మూల ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఉన్న పండ్ల దుకాణంలోకి వెళ్లింది. కడుపునిండా , తృప్తిగా మేసింది. రెండుగంటల వ్యవధిలో తిరిగి వచ్చేసింది.


తదుపరి తను పెంచుతున్న కుక్కను లోపలికి వదలమని కోరారు గురువుగారు. దానిని కూడా లోపలికి పంపారు. అది కూడా తిరుగుతూ, తిరుగుతూ వాసన చూస్తూ, మూడవ అంతస్థులో మాంసం అమ్మే దుకాణంలోకి వెళ్లింది. తృప్తిగా తినేసింది. మూడు గంటల వ్యవధిలో అది కూడా తోక ఊపుకుంటూ యజమాని దగ్గరకు వచ్చేసింది.


ఈసారి ఒక సామాన్యుడిని పిలిచి, నీకు నచ్చినన దానిని తీసుకో అని చెప్పి పంపారు గురువు. 


ఉత్సాహంతో లోపలికి ప్రవేశించిన మనిషి అన్నింటినీ చూసి, ఉక్కిరిబిక్కిరైపోయాడు. ఏం తీసుకోవాలో అర్ధం కావటం లేదు. 


రెండు, మూడు, నాలుగు గంటలు గడిచిపోయినా బయటకు రావడం లేదు. అందరూ ఆశ్చర్యపోయారు. గురువుగారు యజమానిని కలిసి అతడున్న చోటకి చేరుకున్నాడు. నెత్తిమీద చేతులు పెట్టుకుని దిక్కులు చూస్తున్న ఆ వ్యక్తికి ఏం కావాలో అర్ధం కావడం లేదు. ఈ వస్తులన్నింటినీ చూస్తుంటే పిచ్చెత్తిపోతోంది అన్నాడు ఆ వ్యక్తి. 


దీనిని విన్న సంపన్నుడు అవాక్కయ్యాడు. 


ఆవుకీ, కుక్కకీ పిచ్చెక్కలేదు. వాటికి ఏం కావాలో వెతుక్కుని తృప్తిగా ఆరగించి వచ్చాయి. 


మనిషి మాత్రం ఏం కావాలో తనకే తెలియదు. తనకే అన్ని తెలుసనుకుంటాడు.


పాపం! అందుకే వీడికి గురువు కావాలి.


ఎలా జీవించాలో జీవిత ఔన్నత్యాన్ని ఎలా పొందాలో తెలుసుకోవాలి. 


అందుకే వాటిని తెలియజెప్పే గురువు అత్యంత అవసరమని గురువుగారు చెప్పడంతో యజమానికి ధనగర్వం తొలగింది.


గురువుతోనే గమ్యం సాధ్యమని తెలుసుకున్నాడు.

Tuesday, April 16, 2024

What is spiritual Geometric healing or Symbols Healing?

 What is spiritual Geometric healing or Symbols Healing?


Spiritual geometric healing or symbol healing is a holistic approach that utilizes sacred geometric shapes or symbols to facilitate healing on a spiritual, emotional, mental, and physical level. These shapes or symbols are believed to carry certain energetic frequencies or vibrations that can positively influence the energy field of individuals, promoting balance, harmony, and well-being. Practitioners may use various techniques such as visualization, meditation, or placing physical representations of these symbols on the body or in the environment to channel their healing energies.


Soul Mission World

25 Deep Astral Tests in the Astral Realms

 25 Deep Astral Tests in the Astral Realms These astral tests are not merely symbolic—they are energetic initiations encountered by the soul...